అక్కిరాజు ఉమాకాంతం
వికీపీడియా నుండి
తెలుగు, సంస్కృతము, ఆంగ్లములలో పండితుడైన అక్కిరాజు ఉమాకాంతం (1889-1942) తెలుగు సాహితీ విమర్శకు చాలా ప్రభావితము చేసిన రచయిత.
1910 లో త్రిలింగ కథలు ప్రచురించాడు. 1911 లో అక్కిరాజు ఉమాకాంతం మొట్టమొదట పల్నాటి వీరచరిత్ర యొక్క ప్రతులు సంపాదించి, సంస్కరించి అచ్చువేయించాడు. 1928 లో ఆధునిక కవిత్వములో ప్రమాణాలు లేకపోవడాన్ని విమర్శిస్తూ నేటి కాలపు కవిత్వం రచించాడు. ఈయన విమర్శకుడే కాక రచయిత కూడా. 1913 లో టిప్పూ సుల్తాన్ జీవత చరిత్ర ఆధారముగా రచించిన నవల ప్రముఖమైనది