గుర్రాలగొండి
వికీపీడియా నుండి
గుర్రాలగొండి మెదక్ జిల్లా చిన్న కోడూరు మండలమునకు చెందిన ఒక గ్రామము. మెదక్ జిల్లాలో అభివృద్ధి చెందిన గ్రామాలలో గుర్ర్రాలగొండి ఒకటి. అన్ని రోడ్లు తారువేసి చక్కగా నిర్వహించబడుచున్నవి. గ్రామములో రెండు ప్రభుత్వ పాఠశాలలు కలవు. వీటిలో ప్రతిభావంతమైన ఉపాధ్యాయులు, చక్కని భవనాలు, ఆటస్థలములు కలవు. నీటి యెద్దడివలన మంచినీటి సరఫరాను 20 నీళ్ల టాంకర్లతో నిర్వహించుచున్నారు. పంచాయితీ సమావేశాలను నిర్వహించడానికి కొత్తగా రెండు భవనాలను నిర్మించారు. ఇక్కడ ఉన్న విధ్యుచ్ఛక్తి ఉప కేంద్రము చుట్టుపక్కల 5 గ్రామాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నది. ఈ గ్రామము నుండి అనేకమంది విద్యావంతులు వచ్చినారు. గుర్రాలగొండి, మెదక్ జిల్లా, చిన్న కోడూరు మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |