జి.ఎం.సి.బాలయోగి
వికీపీడియా నుండి
గంటి మోహనచంద్ర బాలయోగి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్సభ స్పీకర్.
బాలయోగి 1951 అక్టోబర్ 1 న తూర్పు గోదావరి జిల్లా యెదురులంక గ్రామములో గంటి గన్నయ్య మరియు సత్యమ్మ దంపతులకు ఒక దళిత రైతు కుటుంబములో జన్మించాడు. ఈయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ మరియు లా డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. 1982 ఏప్రిల్ 16 న విజయకుమారిని వివాహము చేసుకున్నాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు.
2002 మార్చి 3 న భీమవరము నుండి తిరిగివస్తుండగా సాంకేతిక లోపమువలన హెలికాప్టర్ ఒక కొబ్బరి చెట్టుకు తగిలి కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామము సమీపములోని ఒక చేపల చెరువులో కూలిపోయి, ఆ ప్రమాదములో బాలయోగి మరణించాడు.