ధృవపు ఎలుగుబంటి
వికీపీడియా నుండి
ధృవపు ఎలుగుబంటి (పోలార్ బేర్) అర్కిటిక్ లో ఉండే ఎలుగుబంటి జాతికి చెందిన జంతువు. దీనిని అత్యున్నత పరభక్షి (అపెక్స్ ప్రెడేటర్) అంటే సింహము, పులి వలే సర్వభక్షకురాలు అని చెప్పుకోవచ్చు. ఒత్తుగా ఉండే కుచ్చు, మందముగా తెల్లగా ఉండే శరీరము మంచు రంగులో కలిసి పోయి దీనిని మంచు చలి నుండి కాపాడుతాయి. మందమైన శరీరము వలన , ఇది శీతాకాల స్థుప్తావస్థ(హైబర్‌నేషన్) లో ఉన్నపుడు కదలకుండా, తిండి,నీరు లేకుండా సుమారు నాలుగైదు నెలలు బ్రతకగలదు.
ధృవపు ఎలుగుబంటి ని భూమ్మీద నివసించే అత్యంత పెద్ద మాంసాహారిగా చెప్పుకోవచ్చు. సైబీరియన్ పులి కంటే మగ ధృవపు ఎలుగుబంటి రెండు రెట్లు బరువు ఉంటుంది. సెక్సువల్ డైమార్ఫిజమ్(ఒకటే జంతువులో ఆడ, మగ లలో ఉండే భేదము, ఉదా:- ఆడ ఏనుగుకు దంతాలు లేక మగ ఏనుగుకు దంతాలు ఉండడము) వలన ఆడ ధృవపు ఎలుగుబంటి మగదానిలో సగము ఉంటుంది. చాలా మగ ఎలుగుబంట్లు సాధారణంగఅ 300-600 కిలోల బరువు ఉండి, ఆడ ధృవపు ఎలుగుబంట్లు 150-300 కిలోల బరువు ఉండగా అప్పుడే పుట్టిన పిల్ల మటుకు 600-700 గ్రాములు మాత్రమే ఉంటాయి