సభ్యుడు:Pramodkumar
వికీపీడియా నుండి
[మార్చు] Modati rachana
వెన్నెలను పొత పొసి
వెన్నను మనసుగా చెసీ
ఒక మనిషిని చేయదలిచి బ్రహ్మ
మనకిచ్చాడు కానుకగా అమ్మ.
చంద్రుడికి తన వెన్నెల కన్నా
ఆమె మనసె చల్లన అని,
ఆ కన్నతల్లి పిల్లలకు మామ అయ్యాడు ,
జోలపాట అయ్యాడు.
పెదాల కలయికే అమ్మైతే ,
అమ్మకై నా పెదాలు కలుస్తూనే ఉంటాయి.
నమస్కారమే కృతజ్ఞత కి తార్కాణమైతే ,
అమ్మ కై నా చేతులు విడివడనే విడివడవు
[మార్చు] వర్షించని వెన్నలనీ నవ వర్షం
సమయ సాగరంలో మరో అల ఎగసేందుకు ఉత్సాహపడుతుంది,
కాలగర్భంలో సంవత్సర కాలం కలిసిపోబోతుంది.
కాలెండర్లు మార్చడం
కార్డులు మార్చుకోవడం
మినహా చెసేది ఏమీ లేకపోయినా
ఆశావాదమే కదా ఆమ్లజని!!
ఎదుగుతున్న బిడ్డను చూసి తల్లి , ఆయువు తగ్గుతున్నదనుకోదు కద!!
అంతే! చూపును మార్చు, లోకం నిన్నే చూస్తుంది!!
గతం వెన్నెలనూ వర్షించింది, విషాన్ని చిమ్మింది!
సమతుల్యత సృష్టి నిర్మాణ రహస్యం!!
ఐతే మాత్రం,
కొత్త వత్సరం నరనరాన కొత్త శక్తి నింపలనుకోవడం తప్పు కాదెమో!!
ఆలోచనే కదా ,ఆచరణకు పునాది!
భోగి మంటలు గంగిరెద్దులతో .. హరిదాసు కీర్తనలు,రంగ వల్లులతో... కోడిపుంజుల కోట్లాటలతో ప్రకాశించే ఈ సంక్రాంతి ...
మీ ఇంట ఆనందాలను పూయించాలని ఆశిస్తూ...
కొత్త ఆశలు , కొత్త బాసలు ,అంతా ,ఇపుడంతా కొత్తే ! ఒక్క రోజులో ,కాదు కాదు , ఒక్క సెకనుతో జీవితమే మారాలని కాలానికి కొత్త రంగేసి, కార్దులు మార్చుకొని, కాలెండర్లు కొత్తవి తెచ్చుకొని, మనం చేసే హడావిడి ,కేరింతల సడిని చూస్తూ ,వింటూ ,కాలాచక్రం నవ్వుకుంటుందేమో, పరిగెడుతూనే !! సమయ సంద్రంలో కొత్త కెరటాలకిది కొత్త కాకపోయినా ఎప్పటికప్పుడు కోరికల చిట్టా సవరింపులు , ఆశావాదమే శ్వాసకు నాదమని నిరూపణలు. విధ్వంస విషాద చారకలు, విజ్ఞాన వికాస తారకలు తో... మిశ్రమ ఫలిత సహితయై విశ్రాంతికై నిష్క్రమిస్తుంది, గత వత్సరం! బాధల బరువును సోదరునికి వడ్డిస్తూ!! మోదకారకమై వెలుగొందాలని ని నిట్టూరుస్త్టూ!!!! సమయాన్ని భందించాలని ,సంవత్సారాలతో గెలవాలని , మనసుకి సర్దిచెప్పుకొనే ప్రయాస! మనిషి చేసిన మరో తమాష!! ఐనా...మనిషే కాల ప్రవాహంలో బందీ ఐనప్పుడు, మనసు సమయానికి స్పందిచడం తప్పు కాదెమో!!!
నమస్కారం!! స్వఛ్చమైన తెలుగు ని అభిమానించే భాషా ప్రియులకు స్వాగతం!
దేనీ గురించి ఈ బ్లాగ్ అని మీకో అనుమానం రావచ్చు! మీకు కథలన్నా కవితలన్నా ఇష్టమా .....?, ఐతే ఈ బ్లాగ్ మీ కొసమే!
అందరికి ఏదో ఒక అభిరుచి ఉండడం సహజం కదా! అది సచిన్ లా షాట్ కొట్టడం కావచ్చు! లేక రాజమౌలి లా షాట్ ఓ.కె అని చెప్పడం కావచ్చు!
అది ఏదైన మనకు నచ్చేలా,మనకే వచ్చేలా చేయడమే విలక్షనత! నాకు కథలు కవితలు రాయడమంటే ఇష్టం! నాకిష్టమంటె కుదరదు కదా! మీకు కష్టంగా ఉంటుంది !
తెల్ల కాగితాన్ని అర్థం లేనీ అక్షరాలతో నింపే కుకవి ని కాదు లెండి!
డా||సి.నారాయణ రెడ్డి(జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత!), ఫ్రో||పేర్వారం జగన్నాధం (ప్రముఖ రచయిత) ల ప్రశంసలు పొందినవాన్ని పిచ్చి రాతలు ఎలా రాస్తాను చెప్పండి!
సరె! "కవితలు" అనే పోస్ట్ లొ నా కవితలు కొన్ని ఉంటాయి ..చదవండి! నచ్చినా, నచ్చకపోయినా కూడ కామెంట్స్ రాయడం మర్చిపోకండి! మీరు మరింత మెచ్చేలా రాయడానికి అది నాకు ఉపయోగపడుతుంది!
మళ్ళీ కలుద్దాం!