వికీపీడియా:WikiProject
వికీపీడియా నుండి
వికీపీడియాలో కొన్ని పేజీలను, ఒక అంశానికి సంబందించి ఉన్న వ్యాసాలను ఎప్పటికప్పుడు విజ్ఞాన సార్వస్వానికి తగినట్లుగా తీర్చిదిద్దటమే వికీప్రాజెక్టుల ఉద్దేశం. ఈ వికీప్రాజెక్టులు ఒకరిద్దరు చేసేవి కావు, కొంత మంది సభ్యులు జట్టుగా ఏర్పడి, ఆ ప్రాజెక్టుకు సంబందించిన వ్యాసాలన్నిటి నిర్వహణ భాద్యతలు చేపడతారు. ఈ పేజీలో ఉన్న చిట్టా ప్రస్తుతం తెవికీలో నిర్వహించబడుతున్న వివిధ ప్రాజెక్టుల వివరాలు తెలుపుతుంది. వాటిలో కొన్ని చాలా ముఖ్యమయినవి, మరికొన్ని అయిపోయినవి ఉంటాయి. ఇంకొన్ని ప్రాజెక్టులు సభ్యుల ఇష్టాల మీద ఆధారపడి సృస్టింపబడతాయి.
విషయ సూచిక |
[మార్చు] భౌగోలికము
[మార్చు] ప్రపంచదేశాలు
ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము ప్రపంచములోని అన్ని దేశాలకు పేజీలు తయారు చేయడము.
[మార్చు] ఆంధ్ర ప్రదేశ్ మండలాలు
ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని మండలాలకు పేజీలు తయారు చేయడము. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతానికి చేదగిన పని పెద్దగా ఏమీలేదు.
[మార్చు] ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు
ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని గ్రామాలకు పేజీలు తయారు చేయడము. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం తెవికీలో అత్యంత ముఖ్యమయిన ప్రాజెక్టుగా భావించబడుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక బాటు నిర్మించబడినది. ఆ బాటు సహాయంతో అనేక గ్రామాలకు పేజీలు తయారు చేయబడినవి. ప్రస్తుతం బాటు తయారు చేసిన పేజీలు సరిగ్గానే ఉన్నాయా లేవా అనేది పరిశీలించడం జరుగుతుంది. అందువలన ఇక్కడ బోలెడంత పని ఉంది. మీ అందరి సహాయం చాలా అవసరం.
మార్చి 2007 - బాట్లతో పేజీలు తయారుచేయడంతో ఈ ప్రాజెక్టు ఆగితే ప్రయోజనం లేదు. ఒకో గ్రామం గురించి ఒకో పేజీ తయారుచేయాలన్నది మన గమ్యం. అయితే జనానీకం నుండి ఆశించిన స్పందన ఈ విషయంలో కరవైంది. కనుక దీనిని ఒక ప్రచారోద్యమంగా నిర్వహించాలని తలపెట్టాము.
వివరాలకు ఈ ప్రాజెక్టు పేజీ చూడండి.
[మార్చు] ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు
ఆంధ్ర ప్రదేశ్ లో జలవనరులు, జలసాధనకై ప్రభుత్వాలు చేసిన, చేస్తూన్న పనులు, వివిధ ప్రాజెక్టులు, వాటిపై వచ్చిన, వస్తూన్న వివాదాలు మొదలైనవాటిని రాయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
[మార్చు] చరిత్ర
[మార్చు] భారతదేశ చరిత్ర
భారతదేశ చరిత్రకు సంబంధించిన అన్ని వివరాలను వికీపీడియాలో చేర్చడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యోద్దేశం.
[మార్చు] తెలుగు శాసనాలు
చరిత్రను అర్ధం చేసుకోవడానికి లేదా నిర్ధారించుకోవడానికి శాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగు శాసనాలన్నిటినీ కాలానుగునంగా వికీపీడియాలో చేర్చి వాటీ అర్ధాన్ని వివరించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉండటం సమంజసమా కాదా అన్న అయోమయముతో దీన్ని మధ్యలోనే ఆపేశారు. అందువల్ల దీన్ని కొనసాగించవద్దు.
[మార్చు] వినోదము
[మార్చు] తెలుగు సినిమాలు
ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము తెలుగు సినిమాలు అన్నింటికీ పేజీలు తయారు చేయడము. 1931లో విడుదలయిన మొట్టమొదటి తెలుగు సినిమా భక్తప్రహ్లాద నుండి ఇటీవల విడుదలవుతున్న సినిమాల దాకా అన్ని సినిమాల గురించి సమాచారాన్ని సేకరించి వికీపీడియాలో నిక్షిప్తం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
[మార్చు] కంప్యూటర్లు
[మార్చు] వికీయజ్ఞము కంప్యూటరు శాస్త్రము
ఈ వికీ యజ్ఞము యొక్క ఉద్దేశ్యము కంప్యూటరు శాస్త్రమునకు చెందిన అన్ని వ్యాసాలు సృష్టించడము, చక్కగా రూపొందించడము.
[మార్చు] లినక్సు
లినక్సు దాని అనుబంద సాంకేతిక అంశాలను తెలుగు వారికి సులువుగా అర్ధమయేటట్లు వివరించడానికి వివిధ వ్యాసాలను తెలుగులో సృస్టించడం ఈ ప్రాజెక్టూ లక్ష్యం.