అనిమెల
వికీపీడియా నుండి
అనిమెల, కడప జిల్లా, వీరపునాయునిపల్లె మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామానికి నాలుగు వైపులా నాలుగు కొండలు ఉన్నాయి. తూర్పున సుడిబొట్టు, పశ్చిమాన ఎర్రమటిగుట్ట, దక్షినాన పాలకొండ మరియు ఉత్తరాన కోరుకొండ ఉన్నాయి.
విషయ సూచిక |
[మార్చు] దేవాలయాలు
అనిమెల గ్రామంలో రెండు దేవాలయాలు ఉన్నాయి.
[మార్చు] శ్రీ సంగం ఈశ్వర దేవాలయం
పాపాగ్ని, మొగమురు మరియు పెన్న అనే మూడు నదుల కలయిక ఇక్కడే జరగటం మూలాన ఈ దేవాలయానికి సంగం అనే పేరు కలిపారు. ఈ దేవాలయంలో ఉన్న ద్వజారోహం పై ఒక పంచలోహ చిలుక చూడటానికి అందంగా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి, గుర్రపుశాలలు ఇక్క కనిపిస్తాయి. ఒకప్పుడు ఇక్కడ ఐదు రోజుల పాటు తిరుణాల జరిపేవారు.
[మార్చు] భోగదెమ్మ అమ్మవారి గుడి
ఇక్కడి దేవత మీద గ్రామ ప్రజలకు చాల నమ్మకముంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం 3 రోజుల పాటు తిరుణాల జరుపుతారు.
[మార్చు] చూడదగిన ప్రదేశాలు
ఇక్కడ ఉన్న చిన్న చెలిమి, పెద్ద చెలిమి వాగులు చూడదగినవి. చుట్టూ ఉన్న మామిడి చెట్ట్ల వలన ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఈ వాగులు కొండపై ఎక్కడ పుట్టాయో ఇంకా కనుక్కోలేదు. అంతేకాదు ఈ ప్రదేశంలోనే రామకృష్ణాశ్రమం ఉంది.