అమెరికా
వికీపీడియా నుండి
అమెరికా సంయుక్త రాష్ట్రాలు లేదా అమెరికా ఉత్తర అమెరికా ఖండములో అట్లాంటిక్ మహాసముద్రము నుండి పసిఫిక్ మహాసముద్రము వరకు విస్తరించి ఉన్న దేశము. దీనికి కెనడా, మెక్సికో దేశాలతో భూసరిహద్దు మరియు రష్యాతో సముద్ర సరిహద్దు కలదు. అమెరికా, 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య. సమ్యుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ డి.సిలో ఉన్నది.
37 లక్షల చదరపు మైళ్ల (95 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణముతో అమెరికా సమ్యుక్త రాష్ట్రాలు (అన్ని రాష్ట్రాలు మరియు ప్రాంతాలతో కలిపి) వైశాల్యములో మూడవ లేదా నాలుగవ అత్యంత పెద్ద దేశము (చైనా వైశాల్యము లెక్కపెట్టడములో దాని వివాదాస్పద ప్రాంతాలను గణనలోకి తీసుకునే దాన్ని బట్టీ అమెరికా మూడవదో లేక నాలుగవదో అవుతుంది). 30 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచములో అత్యంత జనాభా కలిగిన మూడవ దేశము.
ప్రస్తుత అమెరిక సంయుక్త రాష్ట్రాలు ఉన్న భూమ్మీద 15,000 సంవత్సరాల పూర్వము నుండి ఆదివాస ప్రజలు నివాసమేర్పరుచుకొన్నారు. 16వ శతాబ్దములో ఆంగ్లేయులు, ఫ్రెంచి మరియు స్పానిష్ ప్రజల ఆధ్వర్యాన అమెరికాలో ఐరోపా ప్రజల వలసలు ప్రారంభమయ్యాయి. 1776,జూలై 4న తూర్పు తీరము వెంట ఉన్న 13 బ్రిటీషు కాలనీలు బ్రిటీషు ప్రభుత్వ పాలనను నిరశించి స్వాతంత్ర్యము ప్రకటించుకొని యుద్ధం ప్రారంభించాయి. 1783లో బ్రిటీషు ప్రభుత్వము అమెరికాను స్వతంత్ర దేశముగా గుర్తించడముతో యుద్ధం ముగిసినది. 1776 జూలై 4ని సాధారణముగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు యేర్పడిన రోజుగా గుర్తిస్తారు.
19వ మరియు 20వ శతాబ్దములలో అమెరికా యొక్క సైనిక, అర్ధిక, సాంస్కృతిక మరియు రాజకీయ ప్రాభవము క్రమక్రమముగా పెరిగినది. ప్రచ్చన్న యుద్ధం చివర సోవియట్ సమాఖ్య పతనముతో అమెరికా నేటి ప్రపంచములో ఏకైక అగ్రరాజ్యముగా అవతరించినది. నేడు ప్రపంచవ్యవహారాలలో అమెరికా ప్రముఖ పాత్ర పోషిస్తున్నది.
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |