అరేబియా సముద్రము
వికీపీడియా నుండి
అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రములోని భాగము. దీనికి తూర్పున భారత దేశము, ఉత్తరాన బలూచిస్తాన్ మరియు దక్షిణ ఇరాన్ ప్రాంతము, పశ్చిమాన అరేబియన్ దీపకల్పము, దక్షిణాన సొమాలీలాండ్ యొక్క ఈశాన్యమున ఉన్న కేప్ గౌర్దఫూయి నుండి భారతదేశము లోని కేప్ కొమొరిన్ ను కలుపుతూ ఉన్న ఒక ఊహారేఖ దీని ఎల్లలుగా కలవు. వేదకాలములో ఈ సముద్రమును భారతీయులు సింధూ సాగరము అని పిలిచేవారు.
అరేబియా సముద్ర తీరమున ఉన్న దేశాలు : భారత దేశము, ఇరాన్, ఒమన్, పాకిస్తాన్, యెమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేత్స్ (UAE), సొమాలియా మరియు మాల్దీవులు.
ఈ సముద్రము యొక్క తీరమున ఉన్న ప్రధాన నగరములు ముంబై (బొంబాయి), (భారత దేశము) మరియు కరాచీ, (పాకిస్తాన్).