అశ్వని నాచప్ప
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
అశ్వనీ నాచప్ప (అక్టోబర్ 21, 1967), కర్ణాటక రాష్ట్ర కూర్గ్ ప్రాంతానికి చెందిన మాజీ భారతీయ క్రీడాకారిణి. ఈమె మహిళల పరుగుపందెములో 80వ దశకపు తొలినాళ్లలో పి.టి.ఉషాను ఓడించి భారతీయ ఫ్లోజోగా పేరుతెచ్చుకున్నది.
ఆటలకు అందాన్ని తెచ్చిన ఈమె క్రీడా రంగము నుండి విరమించిన తర్వాత 1994 అక్టోబర్ 2 న ఇండియన్ ఏయిర్‌లైన్స్ జట్టు హాకీ ఆటగాడు దత్త కరుంబయ్యను వివాహము చేసుకొని ఇద్దరి ఆడ పిల్లల (అనీషా, దీపాలీ) తల్లి అయినది. 1992లో అశ్వినీ, పి.టి.ఉషాను ఓడించిన సమయములో తెలుగు సినిమా నిర్మాత రామోజీ రావు, దర్శకుడు చంద్రమౌళి క్రీడారంగ ప్రధానమున్న సినిమా తీయాలనే యోచనతో ఢిల్లీ లో ఉండగా వాళ్లు నెహ్రూ స్టేడియం లో అశ్వనీని కలిసి సినిమాలో నటించవలసిందిగా కోరారు. నటనా? తనా? అని మొహమాటపడిన ఈమెను ఒప్పించి అశ్వినీ పేరుమీద ఒక తెలుగు సినిమా తీశారు.