ఒంగోలు
వికీపీడియా నుండి
ఒంగోలు ప్రకాశం జిల్లా యెక్క ముఖ్య పట్టణము మరియు ఒంగోలు మండలముకు కేంద్రము.పూర్వము దీని పేరు వంగవోలు.ఒంగోలుజాతి ఎద్దులు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఎద్దులు.ప్రఖ్యాతిచెందిన జేబూ(Zebu)జాతి ఎద్దులలో ఇవి ఒకటి.ఆంధ్రప్రదేశ్ లో పొగాకుపంటకు ఒంగోలు ఒక ప్రదాన ఉత్పత్తి, వాణిజ్య కేంద్రము.
[మార్చు] చరిత్ర
ఒంగోలు సమీపంలోని చినగంజాంలో దొరికిన ఆధారాలు అనుసరించి మౌర్య ,శాతవాహనుల పాలన కాలంలోణనే ఈ పట్టణం రూపుదిద్దుకున్నట్లు ఋజుఔతుంది.శాతవాహనుల తరవాత కాకతీయుల పాలనలో ఈ పట్టణం వెలుగులోకి వచ్చింది.ఆ సమయలో మోటుపల్లి మరియు ఓడరేవు ప్రసిద్ధ రేవు పట్టణాలుగా ఉన్నాయి.
[మార్చు] ఆర్ధికం
ఒంగోలులోని పెద్ద వ్యాపార సంస్తలు రైతుకుటుంబాలచే స్తాపించబడ్డాయి.పొగాకు కంపెనీలు ,పంట,వ్యాపారం బాగా జరుగుతూ వచ్చింది.డెబ్బయ్,ఎనబై దశాబ్దంలో షూ,పెయింట్,మందులకంపెనీ,పివిసి మొదలైనకంపెనీలు ప్రారంభిచబడ్డాయి.కానీ వీటిలో చాలావరకు అంధ్రప్రదేశ్ లోపల వెలుపల ప్రాతాలలోని పోటీకి నిలిచి మనుగడ సాగించడంలో విఫలమయ్యాయి.మావవశక్తి,పెట్టుబడులు మరియు విజయవంతంగా నడపటానికి కావలసిన నాయకత్వం కొరతే దీనికి కారణం. ఎనభై(80),తొభైయవ(90)దశాబ్దంలో నూతన సెకండరీ,ఇన్టర్ మీడియట్ స్కూల్స్,ఆసుపత్రుల స్తాపనలు అధికమైనాయి ఒంగోలు విద్యాపరంగా అభివృద్దిలో ఉన్న ప్రదేశం