కంఠంరాజు కొండూరు
వికీపీడియా నుండి
కంఠంరాజు కొండూరు: గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలానికి చెందిన గ్రామము.
ఇది దుగ్గిరాలకు 2 కి.మీ దూరములొ వున్నది. కాంటినెంటల్ కాఫీ ఫ్యాక్టరీ ప్రక్కన రోడ్డు గుండా మంచికలపూడి గ్రామము దాటగానే కంఠంరాజు కొండూరు గ్రామము వుంటుంది. ఈ గ్రామము లొ ప్రసిద్ది చెందిన మహంకాళీ ఆలయము వున్నది. ప్రతి ఆదివారము ఈ ఆలయము వద్ద భక్తులు వేలాదిగా చేరి ఆనందోత్సాహముతో ప్రార్ధనలు చేస్తారు. దేవాభక్తుని సుబ్బారావు గారు ఈ ఆలయమునకు శాశ్వత ధర్మకర్తగా వుండి, దీనికి పేరు ప్రఖ్యాతులు కలిగేందుకు ఎంతో సహకరించారు.