కవిత్రయం
వికీపీడియా నుండి
వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని తెలుగు పద్యకావ్యంగా అనువదించిన ముగ్గురు కవులు తెలుగు సాహితీ చరిత్రలో కవిత్రయం అని మన్ననలందుకొన్నారు.
[మార్చు] నన్నయ్య
ఈయన తెలుగు సాహిత్యానికి ఆద్యుడు. ఆదికవి అని పేరుగన్నవాడు. మహాభారతాన్ని తెలుగులో వ్రాయడం అనే మహాకార్యాన్ని చేపట్టినవాడు. ఆదిపర్వము, సభాపర్వము రచించి, అరణ్యపర్వము కొంత వరకే వ్రాయగలిగాడు.
[మార్చు] తిక్కన
ఈయన భారతంలో అత్యధిక భాగాన్ని తెలుగు సేసిన మహాకవి. నన్నయ అసంపూర్ణంగా వదిలేసిన అరణ్య పర్వాన్ని అలాగే ఉంచి మిగిలిన 15 పర్వాలనూ తిక్కన వ్రాశాడు.
[మార్చు] ఎఱ్ఱన
ఈయన ప్రబంధ పరమేశ్వరుడని పేరుపొందాడు. నన్నయ, తిక్కన అసంపూర్ణంగా వదలివేసిన అరణ్యపర్వభాగాన్ని తెలుగు చేశాడు.
తెలుగు సాహిత్యము|తెలుగు సాహితీకారులు|ప్రముఖ కావ్యాలు