కాశీనాథుని నాగేశ్వరరావు
వికీపీడియా నుండి
విశ్వదాత, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు తలచుకొంటే లక్షలపై లక్షలు ఆర్జించి కోట్లకి పడగలెత్తేవారు. ఆయన దేశభక్తినీ వితరణశీలాన్నీ గాంధీ మహాత్ముడు కూడ మెచ్చుకున్నారు. నాగేశ్వరరావు పెద్ద చదువులు చదవలేదు. పదవులు ఆశించలేదు. ఆడంబర రాజకీయాల జోలికి పోలేదు. అమృతాంజనం ద్వారా గణించిన డబ్బుని పేద విద్యార్ధులకి వేతనాలుగా ఇచ్చేసేవారు. ఆయన ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్ర గ్రంధాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసేరు. ఆయన స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసేరు.
జీవితం: 1867-1938; స్వగ్రామం: కృష్ణా జిల్లా ఎలకుర్రు; తల్లిదండ్రులు: స్యామలాంబ, బుచ్చయ్య