కుమార శతకము
వికీపీడియా నుండి
ఉదాహరణలు:
- శ్రీ భామినీ మనోహరు
- సౌభాగ్య దయా స్వభావు సారసనాభున్
- లో భావించెద; నీకున్
- వైభవము లొసగుచుండ, వసుధగుమారా!
శ్రీ లక్ష్మీ మనోహరుడు, సౌభాగ్యదాత, కరుణామయుడు, పద్మనాభుడు అగు శ్రీ మహావిష్ణువు నీకు భుమిపై సకల వైభవములొసగమని పూజింతును.
- ధరణీ నాయకు రాణియు
- గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
- న్న రమణి దనుగన్నదియును
- ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా!
రాజుగారి భార్య, గురువుగారి భార్య, అన్నగారి భార్య, భార్యను కన్న తల్లి, తనను కన్న తల్లి - ఈ అయిదుగురిని తల్లులుగా భావింప వలెను.
- జగడంబులాడు చోటను
- మగువలు వసియించు చోట మదగజము దరిన్
- పగతుండు తిరుగు చోటను
- మగుడి చనగవలయును జలము మాని కుమారా!
పోట్లాటలు జరిగో చోటును, స్త్రీలు నివసించే ప్రదేశమును, మదించిన ఏనుగు దగ్గర, శత్రవు ఉండే చోటును వెంటనే వదిలి వెళ్ళుట మంచిది.
- పెక్కు జనుల నిద్రింపగ
- నొక్కెండయ్యెడను నిద్రనొందక యున్నన్
- గ్రక్కున నుపద్రవంబగు
- నక్కర్మమునందు జొరకుమయ్య కుమారా!
అందరూ నిద్రిస్తూ ఉండగా ఒక్కడే మెలకువగా ఉందవలసి వచ్చినదంటే అక్కడేదో ప్రమాదం జరగనున్నట్లే. అటువంటి పని జోలికి నీవు వెళ్ళవద్దు. (దొంగ పని గాని, కాపలా దారు పని గాని అపాయంతో కూడినవి)
- అవయవ హీనుని, సౌంద
- ర్య విహీను, దరిద్రు, విద్యరాని యతని సం
- స్తవనీయు, దేవు, శ్రుతులనహ
- భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా!
వికలాంగుని, అనాకారిని, పేదవానిని, చదువురానివాడిని, గౌరవింపదగినవానిని, దేవుడిని, వేదములను నిందింపరాదని పండితులు అందురు.
చేయకుము కాని కార్యము పాయకుము మఱిన్ శుభంబవని బోజనమున్ జేయకుము రిపు గృహంబున గూయకు మొరుమనసు నొచ్చుగాత కుమారా!
శతకములు | బొమ్మ:Satakamu.png |
---|---|
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | నీతి శతకము | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | శతకము |