గుమ్మడికాయలు
వికీపీడియా నుండి
గుమ్మడి లేదా తియ్య గుమ్మడి
Pumpkin Cucurbita moschata, N.O. cucurbitaceae.
గుమ్మడి ఆంధ్రులకు ప్రీతికరమైన శుభప్రదమైన తరచూ వాడబడు కూర.
విషయ సూచిక |
[మార్చు] భౌతిక రూపము
పూవుయొక్క, కాయయొక్క పరిమాణమున ఈ కుటుంబమునందలి జాతులందు గుమ్మడి అగ్రస్థానము వహించును, అందుకే దీనిని గుమ్మడి జాతి అందురు. పౌష్టిక శక్తిలోకానీ, తినుట కింపుగా ఉండుటయందు కూడా ఇదే మంచిది.
గుమ్మడితీగ చాలా ఎక్కువగా పాకు మోటు జాతి తీగ. కాండము గరుసుగా ఉండు రోమములు కలిగి ఉండునును. ఆకులు హృదయాకారము కలిగినవి. ...