గోంగూర పచ్చడి
వికీపీడియా నుండి
గోంగూర పచ్చడి తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైనది.
కావల్సిన పదార్ధాలు : గోంగూర, ఎండిమిర్చి, దనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు
తయారుచేయు పద్దతి : ముందుగా ఎండిమిర్చి, దనియాలు, జీలకర్ర లను నూనె వేసి బాగా వేగించి ప్రక్కన ఉంచవలెను. తరువాత అదే గిన్నెలో మరికాస్త నూనె వేసి శుభ్రపరిచిన గోంగూరను వేసి వేగించవలెను.వేగించినవన్నీ సరిపడినంత ఉప్పు , చింతపండు , వెల్లులి వేసి మెత్తగా రొబ్బుకొనవలెను. తరువాత రుబ్బిన పచ్చడిలో ఇస్టపడినవారు కిద్దిగా నూనె , పచ్చి ఉల్లిపాయముక్కలు చిన్నవిగా చేసి కలుపుకొనిన పచ్చడి చాల రుచికరంగా ఉండును.