గోవాడ, చోడవరం
వికీపీడియా నుండి
గోవాడ, విశాఖపట్నం జిల్లా చోడవరం మండలంలోని గ్రామం. అనకాపల్లి నుండి మాడుగుల వెళ్ళే దారిలో అనకాపల్లికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఇది. అరవై ఏళ్ళ క్రితం ఈ ప్రాంతాలలో పెద్దపులులు (tigers), దుమ్ములగొండ్లు (hyenas) తిరిగేవి. ఒకసారి గోవాడ గ్రామస్తులు ఒక పెద్దపులిని కర్రలతో కొట్టి, చంపి, దాని కళేబరాన్ని అనకాపల్లి - చోడవరం దహదారి మీదకి మోసుకొచ్చేరు. ఇదే రహదారి మీద డెబ్భయ్ ఏళ్ళ క్రితం ఒక దుమ్ములగొండిని చూసిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఈ వన్య మృగాలేవీ కనబడటం లేదు.