చర్చ:చందమామ
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] చందమామ బొమ్మలు
త్రివిక్రం, మీరు చేర్చిన బొమ్మ సంస్కృత చందమామదే నంటారా?. నేను వ్యాసంలొ చేర్చిన agencyfaqs.com లింకులొ ఇంకొక బొమ్మ చూసాను. దాని మీద చందామామ ( ఒక ఆ కారం ఎక్కువ ఉంది). ఒక్క సారి సరి చూడండి Kiranc 12:56, 18 ఏప్రిల్ 2006 (UTC)
ఆ బొమ్మ నేను చేర్చింది కాదు. వైజాసత్య గారు చేర్చారు. అన్నట్లు పేజీ ఇప్పటికే పెద్దదైపోయింది. లోగో ఉంచి బొమ్మను తీసేయడం మేలేమో ఆలోచించండి. Trivikram 13:28, 18 ఏప్రిల్ 2006 (UTC)
- బొమ్మలను ఉంచండి, వ్యాసాన్ని రెండు బాగాలుగా విభజించి ఒక్కో బాగాన్ని ఒక్కో కొత్త వ్యాసంగా రాయండి. సినిమాలలో మనకు కనిపించేది నటులు, తెరవెనుక బోలెడంత సాంకేతిక వర్గం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా, ఒక వ్యాసంలో చందమామ కధల శైలి వివరిస్తూ ఇంకో వ్యాసంలో ఆ కధలను మలిచిన వారి గురించి రాయొచ్చేమో. లేదా ఇంకేదయినా మంచి ఆలోచనలతో వ్యాసాన్ని విభజించవచ్చు. అలాగే తెలుగు చందమామ ముఖచిత్రం కూడా చేరిస్తే బాగుంటుంది. అలాగే బేతాళ కథకు సంబందించి ఒక చిత్రం ప్రతీ సంచికలో ఒకే విధంగా ఉంటుంది. దానిని కూడా చేరిస్తే వ్యాసం ఇంకా బాగుంటుంది. అసలు నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ బొమ్మలు చేర్చిన కొద్దీ వ్యాసానికి మరింత నిండుతనం వస్తుంది. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:04, 18 ఏప్రిల్ 2006 (UTC)
-
- బొమ్మ సంస్కృతముదో కాదో నాకు ఖచ్చితంగా తెలియదు ఏదో వెబ్‌సైటులో కనబడింది ఫెయిర్ యూజ్ కింద అప్లోడ్ చేశా. కానీ జూం చేసి చందమామ పైన చిన్న అక్షరాలు పరిశీలిస్తే సంస్కృత అని ఉంది అని అనిపించింది. అయినా బొమ్మలు వ్యాసము యొక్క నిడివిని పెద్దగా పెంచవు. కాబట్టి రెండు బొమ్మలు ఉంచొచ్చు. ఇక వ్యాసాన్ని ఎలా విభజించాలో అర్ధము కావట్లేదు. ప్రస్తుతము అది 32 కిలోబైట్లు ఉన్నది. అది అంత ఎక్కువేమీ కాదనుకుంటా. అయితే ఇంకొంచెము పెరిగితే మనము తప్పకుండా విభజించే మార్గాలు అన్వేషించాలి --వైఙాసత్య 16:04, 18 ఏప్రిల్ 2006 (UTC)
- అలాగైతే ఇంకో 3 బొమ్మలు -బేతాళ కథల బొమ్మ; తెలుగు చందమామ, ఇంగ్లీషు చందమామ ల ముఖ చిత్రాలు చేర్చవచ్చు. మరి ఫోటో ల మాటేమిటి? చక్రపాణి-నాగిరెడ్డి, కొ.కు. ల ఫోటోలు పెడదామా వద్దా? వ్యాసం (text) ఇంకో 10-15% పెరగ వచ్చు. ఫర్వాలేదంటారా? Trivikram 18:56, 18 ఏప్రిల్ 2006 (UTC)
- వారు ముగ్గురు కలిసి ఉన్న ఫొటో అయితే పరవాలేదు. లెకుంటే వద్దు , irrelevant గా ఉంటుంది అని నా అభిప్రాయం--Kiranc 04:23, 19 ఏప్రిల్ 2006 (UTC)
చిత్రకారుల విభాగములో ఉన్న తెలుగు చందమామ ముఖచిత్రాన్ని వివిధ భాషా సంచికల విభాగంలోకి మర్చానండి. అది అక్కడ ఐతే relevantగా ఉంటుంది అని నా అభిప్రాయం. చిత్రకారుల sectionలోకి మంచి strikingగా ఉండే చిత్రాన్ని ఎదైనా పెడితే బాగుంటుంది. ఇంగ్లిషు పత్రిక ముఖచిత్రము అంత బాగోలేదు. కొంచం పెద్దది పెడితే బాగుంటుంది -- Kiranc 04:36, 20 ఏప్రిల్ 2006 (UTC)
[మార్చు] విశేషవ్యాసంగా..
విశిష్టమైన వ్యాసమిది. వచ్చే సోమవారం నాడు - ఏప్రిల్ 24న - విశేషవ్యాసంగా పెడదాం! __చదువరి (చర్చ, రచనలు) 07:20, 20 ఏప్రిల్ 2006 (UTC)
ఈ లోపల బేతాళ కథల బొమ్మ సంపాదించాలి. అది ఉంటేనే నిండుదనం వచ్చేది. - Trivikram 07:27, 20 ఏప్రిల్ 2006 (UTC)
చాల చక్కటి ఆలోచన. నేను బేతాళ కథలు చిత్రాన్ని చేర్చాను. ఇంక ప్రస్తుత సంపదకుడూ విశ్వం చిత్రం కూడ ఉంది .అది కూడా పెడదామంటారా?. Kiranc 11:09, 20 ఏప్రిల్ 2006 (UTC)
- విశేష వ్యాసములకు ఆంగ్ల వికిలో లాగా కాంస్య తార ఎలా పెట్టవచ్చు? --వైఙాసత్య 13:46, 20 ఏప్రిల్ 2006 (UTC)
- వ్యాసం చివరన {{విశేషవ్యాసం|ప్రచురించిన తేదీ}} చేర్చండి. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 18:11, 20 ఏప్రిల్ 2006 (UTC)
[మార్చు] పూర్తిగా రంగుల్లో
చందమామలో అన్ని పేజీలూ పూర్తిగా రంగుల్లో రావడం (multi colour) 1980 ప్రాంతాల్లో మొదలైంది. సంవత్సరం, నెల ఎవరికైనా గుర్తున్నాయా? త్రివిక్రమ్ 00:56, 23 ఏప్రిల్ 2006 (UTC)
[మార్చు] 60 వసంతాల చందమామ
చందమామ 60 వసంతాలు పూర్తి చేసుకుంతున్న సందర్భంగా. కొంత విషయం , మరి కొన్ని అరుదైన బొమ్మల్ని చేర్చాను Kiranc 13:12, 29 ఆగష్టు 2006 (UTC)
చాన్నాళ్ళ తర్వాత తిరిగొచ్చి చాలా మంచి పని చేశారు కిరణ్! నేనూ అనుకోకుండా రీడిఫ్ వెబ్‌సైట్‌లోని ఆ వ్యాసాన్ని నిన్న రాత్రే చూశాను. ఈ రోజంతా తీరిక లేకపోవడం వల్ల ఆ సమాచారాన్ని ఇక్కడ చేర్చలేకపోయాను. మీరు చేర్చినందుకు చాలా ఆనందంగా ఉంది.
-త్రివిక్రమ్ 13:47, 29 ఆగష్టు 2006 (UTC)
ఈ మధ్య ఎవరో సభ్యుడు తమిళం మరియు ఇంగ్లిషు ఇంటర్వికి చేర్చాడు. నేను ఆ వ్యాసాల్ని చూసాను. ఇంగ్లిషు ఘొరం (4 లైన్లకు మించి లేదు). తమిళంలొ ఏదో విషయం ఉన్నట్టు కనపడుతున్నా, మన వ్యాసం కాలి గొటికి కూడ సరిరాదు. తమిళం వచ్చినవారు ఎవరైనా ఉంటే ఆ వ్యాసంలో కొత్త విషయాలు ఏమైనా ఉంటే తెలుగు వ్యాసం లో చేర్చగలరు.
Kiranc 01:56, 30 ఆగష్టు 2006 (UTC)