తరిగొండ వెంకమాంబ
వికీపీడియా నుండి
తరిగొండ వెంకమాంబ (1800 - 1866), 19వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. వెంకమాంబ అనేక పాటలు, యక్షగానాలు రచించినది. వెంకమాంబ చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలములోని తరిగొండ గ్రామములో కృష్ణమాచార్య మరియు మంగమాంబ అను నందవారిక బ్రాహ్మణ దంపతులకు 1800ల ప్రాంతములో జన్మించినది.
వెంకమాంబ బాల్యములో తన తోటి పిళ్లవాళ్లలాగా ఆటలాడుకోక ఏకాంతముగా కూర్చొని భక్తి పారవశ్యముతో మునిగితేలేది. ఆ చిరు ప్రాయములోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురముగా గానము చేసేది. తండ్రి ఆమె భక్తిశ్రద్ధలను గమనించి ఆమె నైపుణ్యమును సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువు వద్దకు శిక్షణకు పంపినాడు. దీక్షితులు ఆమె ప్రతిభను గుర్తించి తనకు తెలిసిన పరిజ్ఞానమంతా వెంకమాంబకు భోధించినాడు. అనతి కాలములోనే వెంకమాంబ ప్రశస్తి నలుమూలల పాకడముతో తండ్రి ఆమె విధ్యాభ్యాసమును మాన్పించి తగిన వరునికోసము వెతకడము ప్రారంభించాడు.
తల్లి వెంకమాంబను ఇంటి పనులలో సహాయము చేయమని కోరగా తన సేవ భగవంతునికే అర్పణమని వెంకమాంబ తిరష్కరించినది. అనేక మంది వరులు ఆమెను చూచి చాలా అందముగా ఉన్నదనో, చాలా తెలివైనదనో నెపములతో పెళ్లి చేసుకొనుటకు సమ్మతించలేదు. చివరకు వెంకటాచలప్ప ఆమె అందమును చూసి ముగ్ధుడై ప్రేమలో పడి వెంకమాంబను వివాహమాడుటకు అంగీకరించాడు. తండ్రి ఆమెకు మంచిభార్యగా మసలుకోమని హితవు చెప్పి వివాహము జరిపించినాడు. వివాహానంతరము వెంకటాచలప్ప ఆమె భక్తి మౌఢ్యాన్ని వదిలించ ప్రయత్నము చేసినాడు కానీ వెంకమాంబ అతనిని దగ్గరికి రానివ్వలేదు.
వెంకమాంబ రచనలన్నీ వేదంతము మరియు భక్తి ప్రధానమైనవే. ఈమె రచనలలో ముఖ్యమైనవి వెంకటాచల మహత్యము, విష్ణు పారిజతము, వశిష్ఠ రామాయణము, రాజయోగసారము, జలక్రీడా విలాసము, ద్విపద భాగవతము, మరియు కృష్ణ మంజరి.
[మార్చు] మూలములు
- వుమెన్ రైటింగ్ ఇన్ ఇండియా 600 బీ.సీ. టు ద ప్రెజెంట్ - సూసీ థారూ, కే.లలిత వాల్యూం 1 పేజీ 122-124 (ఆంగ్లములో)