త్యాగరాజు కీర్తనలు
వికీపీడియా నుండి
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరయిన త్యాగరాజులవారి కీర్తనలు
విషయ సూచిక |
[మార్చు] కీర్తనలు
మచ్చుకు ఈ కీర్తనను చూడండి:
బిళహరి రాగము - ఆది తాళము
దొరకునా ఇటువంటి సేవ ॥దొరకునా॥ దొరకునా తప మొనరించిన భూ సురవరులకైన సురలకైన ॥దొరకునా॥
తుంబుర నారదులు సుగుణకీర్త
నంబుల నాలాపము సేయగా
అంబరీష ముఖ్యులు నామము సే
యగ జాజులపై చల్లగా
బింబాధరులగు సురవారయళి
వేణులు నాట్యములాడగా
అంబుజభవ పాకారు లిరుగడల
నన్వయ బిరుదావళిని బొగడగా
అంబరవాస సతులు కరకంక
ణంబులు ఘల్లని విసరగ మణిహా
రంబులు ఘల్లని విసరగ మణిహా
రంబులు గదలగ సూచే ఫణి త
ల్పంబున నెలకొన్న హరిని గనుగొన ॥దొరకునా॥
మరకతమణిసన్నిభ దేహంబున
మెఱుగు గనకచేలము శోభిల్ల
చరణయుగ నభావళికాంతులు
జందురు పిల్లలను గేర
వరనూపురము వెలుగంగ గతయుగమున
వజ్రపు భూషణములు మెఱయ
ఉదమున ముక్తాహారములు మఱియు
ఉచితమైన మకరకుండలంబులు
చిఱునవ్వులుగల వదనంబున ముం
గురు లద్దంపుగపోలము ముద్దు
గురియు దివ్యఫాలంబున దిలకము
మెఱసే భువిలావణ్యనిధిని గన
తామసగుణరహిత మునులకు బొగడ
దరముగాకనే భమసి నిల్వగ
శ్రీమత్కనకపు దొట్లపైని చెలు
వందగ గొలువుండగ
కామితఫలదాయకియౌ సీత
కాంతునిగని యుప్పొంగగ
రామబ్రహ్మ తనయుడౌ త్యాగ
రాజు తా బాడుచు నూచగ
రాముని జగదుద్దారుని సురరిపు
భీముని త్రిగుణాతీతుని బూర్ణ
కాముని చిన్మయరూపుని సద్గుణ
ధామని కనులార మదిని కనుగొన ॥దొరకునా॥
[మార్చు] నగుమోము కనవా!
పల్లవి:నగుమోము కనవా నీనామనోహరుని
జగమేలు సూరుని జానాకీ వరునీ
చరణం1:దేవాదిదేవూని దివ్యసుందరునీ
శ్రీవాసుదేవూని సీతారాఘవునీ
చరణం2:నిర్మాలాకారూనీ నిఖిలాలోచనునీ
ధర్మాది మోక్షంబు దయచేయు ఘనునీ
చరణం3:సుజ్ఞాన నిధిని సోమసూర్యలోచనునీ
అజ్ఞాన తమమును అణచూ భాస్కరునీ
చరణం4:భోదాతో పలుమారు పూజించి నేను
ఆరాధింతు శ్రీత్యాగరాజా సన్నుతునీ
[మార్చు] కోదండ రామ
రామ కోదండ రామ
రామ కల్యాణ రామ
రామ పట్టాభి రామ
రామ పావన రామ
రామ సీతాపతి
రామ నేవేగతి
రామ నీకుమ్రొక్కితి
రామ నీచేజిక్కితి
రామ నేనందయినను
రామ నిను వేడగలేను
రామ ఎన్నడైనను
రామ బాయగలేను
రామ నీకొక్క మాట
రామ నాకొక్క మూట
రామ నీమాటే మాట
రామ నీపాటే పాట
రామ నామమే మేలు
రామ చింతనే చాలు
రామ నేవు నన్నేలు
రామ రాయడే చాలు
రామ నీకెవ్వరు జోడు
రామ క్రీకంట జూడు
రామ నేను నీవాడు
రామ నాతో మాటాడు
రామాభి రాజ రాజ
రామ ముగజీతరాజ
రామ భక్త సమాజ
రక్షిత త్యాగరాజ
[మార్చు] గంధము పూయరుగా...
గంధము పూయరుగా
పన్నీరు గంధము పూయరుగా
అందమైన ఎదునందుని పైని
కుందరదనవర వందగ పరిమళ "గంధము"
తిలకము దిద్దరుగా
కస్తూరి తిలకము దిద్దరుగా
కళకళమని ముఖకళగని సొక్కుచు
పలుకుల నమృతము నొలెకిడి స్వామికి "తిలకము"
చేలము గట్టరుగా
బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాల బాలులతో
నాల మేపిన విశాల నయనునికి "చేలము"
హారతులెత్తరుగా
ముత్యాల హారతులెత్తరుగా
నారీమణులకు వారము యవ్వన
వారక యొసగెడి వారిజాక్షునికి "హారతులు"
పూజలు చేయరుగా
మనసారా పూజలు చేయరుగా
జాజులు మరివిర జాజుల దవనము
రాజిత త్యాగరాజ వినుతునికి "పూజలు"
"గంధము" "తిలకము" "చేలము" "హారతులు" పూజలు"