దేశమును ప్రేమించుమన్నా
వికీపీడియా నుండి
గురజాడ అప్పారావు రచించిన ఈ గేయం ప్రజల్లో దేశ భక్తిని ప్రబోధించి, దేశాభివృధ్ధికై ప్రజలను కార్యోన్ముఖుల్ని చేస్తుంది.
దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్
-
-
- పాడి పంటలు పొంగిపొరలే
- దారిలో నువు పాటు పడవోయ్
- తిండి కలిగితే కండ కలదోయ్
- కండ కలవాడేను మనిషోయ్
- పాడి పంటలు పొంగిపొరలే
-
ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్
-
-
- దేశాభిమానం నాకు కద్దని
- వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
- పూని ఏదైనాను ఒక మేల్
- కూర్చి జనులకు చూపవోయ్
- దేశాభిమానం నాకు కద్దని
-
చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్
-
-
- సొంత లాభం కొంత మానుకు
- పొరుగు వానికి తోడుపడవోయ్
- దేశమంటే మట్టి కాదోయ్
- దేశమంటే మనుషులోయ్
- సొంత లాభం కొంత మానుకు
-
ఈ గేయంలోని రెండు లైనులు చాలా ప్రాచుర్యాన్ని పొందినాయి
అవి చివరి రెండు లైనులు
-
-
- దేశమంటే మట్టి కాదోయ్
- దేశమంటే మనుషులోయ్
- దేశమంటే మట్టి కాదోయ్
-