దొరువు
వికీపీడియా నుండి
దొరువంటే చిన్న నీటి వనరు .ఎక్కువగా పొలాల మధ్య మంచి నీటి కోసం జల పడేవరకు భూమిని తవ్వి వదిలి వేస్తారు.ఇవి ఎక్కువ లోతు ఉండవు.వీటికి బావిలా చుట్టూ కట్టుబడి ఉండదు,ఎక్కువ లోతూ ఉండదు.వెడల్పుగా చక్కగా దిగేలా ఏటవాలుగా చిన్న చిన్నమెట్లు నిర్మిస్తారు.మెట్ల ద్వారా దిగి నీరు తెచ్చుకుంటారు.వీటిలో నీరు ఎక్కువగా దాహం తీర్చుకోవడానికి ఉపయోగిస్తారు .