ధొండొ కేశవ కార్వే
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
మహర్షి ధొండొ కేశవ కార్వే (ఏప్రిల్ 18, 1858 - నవంబర్ 9, 1962) తన జీవితాంతము మహిళా ఉద్ధరణకై పాటుపడినాడు. ఈయన మహిళలకై ఒక కళాశాల ప్రారంభించాడు. భారత దేశములో ప్రప్రధమ మహిళా విశ్వవిద్యాలయమైన ఎస్.ఎన్.డీ.టి మహిళా విశ్వవిద్యాలయమును 1916 లో ముంబైలో స్థాపించాడు. 1958 లో ఈయనను భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నతో సత్కరించారు. కార్వే మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాకు చెందిన షేరావళి లో జన్మించాడు. ఈయన 1962 నవంబర్ 9 న పూణే లో మరణించాడు.