నిజ ఏసుక్రీస్తు మండలి
వికీపీడియా నుండి
నిజ ఏసుక్రీస్తు మండలి ఒక స్వతంత్ర క్రిస్టియను చర్చి, దీనిని చైనాలోని బీజింగు నగరంలో 1917వ సంవత్సరమున స్థాపించినారు. దీనిని భారత దేశమునందు 1939నందు నెలకొల్పినారు. 20వ శతాబ్దం ప్రధమభాగంలో ప్రార్భమైన పెంటెకోస్టు-ప్రొటెస్టెంటు చర్చిలో ఇది ఒక భాగము. ప్రస్తుతం ఈ మండలికి 45 దేశాలలో 15 లక్షలు నుండి 25 లక్షలు దాకా సభ్యులున్నారు.
ఏసుక్రీస్తు ప్రవక్త పునరాగమనానికి తయారుగా భగవంతుని సందేశాన్ని అందరికీ తెలియబరచడం వీరి లక్ష్యము. మిగిలిన క్రైస్తవ పంథాలకూ, వీరికీ ప్రధాన భేదము ఏమంటే - పిత, పుత్ర, పవిత్రాత్మ అనే త్రిగుణ ఆధ్యాత్మికతను (doctrine of the Trinity) తక్కిన చర్చిలు విశ్వసిస్తాయి. కాని ని జ క్రైస్తవ మండలి వారు మాత్రము ఏసుక్రీస్తు నామమునే (Jesus-Name doctrine) అనుసరిస్తారు.
డిసెంబరు 25వతారీఖు పండుగ సూర్యదేవుని జన్మదినాన్ని జరుపుకొనే పండుగ అనీ, రోమను చక్రవర్తి కాన్‌స్టాంటైను కాలంలో క్రైస్వమతంలోకి మిళితంచేయబడిందనీ విశ్వసిస్తారు గనుక నిజ ఏసుక్రీస్తు మండలికి చెందినవారు క్రిస్టమస్ పండుగ జరుపుకొనరు.
విషయ సూచిక |
[మార్చు] చర్చి యొక్క ఐదు ప్రాధమిక సిద్ధాంతాలు
[మార్చు] పవిత్రాత్మ
"ప్రత్యేకమయన భాషలలో మాట్లాడడము అనేది పరిశుద్ధ ఆత్మను అందుకొనడానికి సూచన. ఇది పరలోక రాజ్యము లభిస్తుందనడానకి ఒక ఋజువు" (రోమా 8:16, ఎఫెసీయులు 1:13-14).
[మార్చు] బాప్తిస్మము
"జల బాప్తిస్మము అనే కార్యక్రమము పాపములను ప్రక్షాళనచేయు పవిత్ర కార్యము. బాప్తిస్మము నది నీరు, సముద్రపు నీరు మరియు ఊట నీరు వంటి సహజమైన పరిశుద్ద జలముచే జరప వలెను. బాప్టిస్టు ముందుగా క్రీస్తు నామమున నీరు, పరిశుద్ధాత్మలను గ్రహింవలెను. ఆపై బాప్తిస్మము పొందు వ్యక్తిని పూర్తిగా నీటిలో ముంచవలెని. వారి తలవంగియుండవలెను. ముఖము క్రిందివైపునకు ఉండవలెను".
[మార్చు] పాద ప్రక్షాళనము
"పాదములు కడుగుట అనే పవిత్రకార్యక్రమము వల్ల బాప్తిసము తీసుకొన్నవానికి ప్రభువైన క్రీస్తుతో పాలుపంచుకొను అవకాశము కలుగును. ప్రేమ, పవిత్రత, వినయము, క్షమ, సేవ వంటి ఉత్తమగుణాలు అలవరచుకోవాలని ఈ పని మనకు ప్రబోధిస్తుంది.
జల బాప్తిస్మము తీసికొన్న ప్రతివ్యక్తీ ఏసుక్రీస్తు నామమున పాదములు కడుగుకొనవలెను. వీలయినపుడు ఒకరిపాదములు మరొకరు కడుగుకొనవలెను".
[మార్చు] పవిత్ర ప్రసాదము
"(The Holy Communion) క్రైస్తవ మతములో మహాప్రసాద వినియోగము అనేది క్రీస్తు మరణమును స్మరించుకొనే పవిత్ర కార్యక్రమము. అది ప్రభువు రక్తమాంసాలతో తదైక్యము చెందే అవకాశం. తద్వారా శాశ్వత జీవనము లభిస్తుంది. చివరి దినాన లేవ గలుగుతారు. ఈ పవిత్ర కార్యమును వీలయినన్నిసార్లు నిర్వహించాలి. ఒకే మొత్తము రొట్టెను, ద్రాక్ష రసమును అందుకు వినియోగించాలి. ".
[మార్చు] శావత్తు దినము
"శావత్తు దినము, వారములోని ఏడవ రోజు (శనివారము), దేవునిచే పరిశుద్ధముచేసి ఆశీర్వదించబడిన పవిత్ర దినము. అది ప్రభువు కృపచే పాటింపదగినది. దేవుని సృష్టి కార్యమును స్మరించే పండుగ. తద్వారా ముందు జీవితమున శాశ్వత విశ్రాంతి, మోక్షము పొందే అవకాశము లభిస్తుంది".
[మార్చు] ఇతర నమ్మకాలు
[మార్చు] యేసుక్రీస్తు
"యేసుక్రీస్తు, మూర్తీభవించిన దేవుని వాక్యము. ఆయన పాపులను రక్షించుటకై తననుతాను అర్పించుకొనెను. మూడవరోజున పునరుజ్జీవుడై స్వర్గమునధిరోహించెను. ఆయనొకడే జనరక్షకుడు. భూమ్యాకాశములను సృజించినవాడు. నిజమైన దేవుడు".
[మార్చు] బైబిల్
"పరిశుద్ధ బైబిల్, కొత్త మరియు పాత నిబంధన గ్రంధములతో కూడి, ప్రభువు ప్రేరేపణతో వెలువడిన ఒకే ఒక సత్య పవిత్ర గ్రంధము. క్రైస్తవ జీవనానికి మార్గదర్శకము".
[మార్చు] మోక్షము
" విశ్వాసము వలన భగవంతుని కృప, అందువలన మోక్షము లభిస్తాయి. విశ్వసించేవారు పరిశుద్ధాత్మపై ఆధారపడి పవిత్రతను పొంది, భగవంతుని సేవించి, మానవజాతిని ప్రేమించాలి ".
[మార్చు] చర్చి
"నిజ ఏసుక్రీస్తు మండలి చర్చి అనేది ప్రభువైన యేసుక్రీస్తుచే పవిత్రాత్మ ద్వారా జలప్రళయకాలంలో ఏర్పరచబడినది. ఇది విశ్వాసపాత్రులచే పునరారంభింపబడిన నిజమైన చర్చి".
[మార్చు] పునరాగమనము
"చివరి రోజున ప్రభువు స్వర్గము నుండి ప్రపంచముపై తీర్పు చెప్పుటకు అవతరించును. అదే పునరాగమనము. పరిశుద్ధులైన వారు శాశ్వత జీవనము పొందగలరు. కౄరులైనవారు శాశ్వతముగా శపింపబడుదురు".