పరిటాల ఓంకార్
వికీపీడియా నుండి
![]() |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
పరిటాల ఓంకార్ ప్రముఖ రచయిత, టీవీ నటుడు. రేడియోలో వార్తలు చదవడంతో మొదలుపెట్టి, తరువాత పత్రికలలో శీర్షికా రచయితగా, టీవీ సీరియళ్ళకు రచయితగా, సినిమా నటుడిగా, టీవీ సీరియళ్ళలో నటుడిగా పనిచేసాడు. ఒక సినిమాకు దర్శకత్వం కూడా చేసాడు.
టీవీ సీరియళ్ళ రచయితగా, నటుడిగా ఓంకార్ విశేషమైన పేరు సంపాదించాడు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను తన సీరియళ్ళలో చొప్పించి, ప్రజాదరణ పొందాడు. నటుడిగా తన విలక్షణమైన వాచికంతో ఆకట్టుకున్నాడు.
ఓంకార్ పోలీసుభార్య, పందిరిమంచం వంటి చిత్రాలలో నటించాడు. స్వాతి వారపత్రికలో ఓంకారం పేరుతో వారం వారం శీర్షిక నిర్వహిస్తూ ఉంటాడు.