పాండవ తీర్థం
వికీపీడియా నుండి
పాండవ తీర్థం తిరుమలలో ఉంది. దీనికే గోగర్భ తీర్థమనీ పేరుంది. వేంకటేశ్వరాలయానికి ఈశాన్య దిశలో మైలు దూరంలో ఉన్న పాండవతీర్థంలోనే పాండవ సహోదరులు ఏడాదికాలం నివసించారని ఐతిహ్యం. వైశాఖమాసంలో శుక్లపక్ష ద్వాదశిరోజు, అదీ ఆదివారం అయితే, పాండవతీర్థంలో స్నానం చేయటంకానీ లేదా కృష్ణపక్ష ద్వాదశీ మంగళవారం నాడు స్నానం చేయటంకానీ మంచిదని భక్తులు భావిస్తారు. ఆ రెండు రోజులూ స్నానం చేయటం సకల శ్రేష్ఠం.