ప్రభురాత్రి భోజన సంస్కారం
వికీపీడియా నుండి
'
ప్రభురాత్రి భోజన సంస్కారం - ఆచార్య మార్టిన్ లూథర్ వివరణ (చిన్న ప్రశ్నోత్తరి నుంచి)
'
అత్యంత సులభమైన పద్ధతిలో ఇంటి యజమాని తన ఇంట్లో వాళ్ళందరికీ నేర్పించాల్సింది.
మొదటిగా
ప్రభురాత్రి భోజన సంస్కారమంటే ఏంటి?
ఇది క్రీస్తు చేత నియమించబడి క్రైస్తవులమైన మనం తింటానికి, తాగటానికి రొట్టె ద్రాక్షారసాల క్రింద ఉన్న మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శరీరం, నిజమైన రక్తమై ఉంది.
ఇది ఎక్కడ రాయబడింది?
పరిశుద్ధ సువార్తీకులైన మత్తయి, మార్కు, లూకా ఇంకా అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు... “మన ప్రభువైన యేసు క్రీస్తు తానప్పగింపబడిన రాత్రి రొట్టెను ఎత్తికొని క్రుతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి పుచ్చుకొని తినుడి ఇది మీ కొరకివ్వబడిన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. అటు తర్వాత ఆయన పాత్రను తీసికొని క్రుతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీని లోనిది మీరందరు త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను”
ప్రభురాత్రి భోజనం యొక్క ఆశీర్వాదాలు
రెండోదిగా
ఇలా తిని త్రాగటం వల్ల మనం పొందే ఆశీర్వాదా లేంటి?
పాప క్షమాపణ కోసం మీ కొరకు “ఇవ్వా బడింది”, “చిందింపబడింది” అంటూ చెప్పబడుతున్న మాటల్లో ఈ ఆశీర్వాదాల్ని మనం చూస్తాం. ఈ మాటల ద్వార ఈ పరిశుద్ధ సంస్కారంలోని పాప క్షమాపణ్ణి, జీవన్ని, రక్షణ్ణి మనం పొందుతాం. ఎందుకంటే ఎక్కడ పాప క్షమాపణ ఉంటుందో అక్కడ జీవం, రక్షణ కుడా ఉంటాయి.
ప్రభురాత్రి భోజనానికున్న శక్తి
మూడోదిగా
తినటం వల్ల త్రాగటం వల్ల ఇంత గొప్ప కార్యాలు ఎలా జరుగుతాయి?
కేవలం తినటం వల్ల త్రాగటం వల్ల మాత్రం కాదుగాని, పాప క్షమాపణ నిమిత్తం మీ కొరకు “ఇవ్వ బడింది”, “చిందింప బడింది” అన్న మాటల్ని బట్టి ఈ గొప్ప కార్యాలు జరుగుతాయి. తినటం త్రాగటంతో పాటు ఈ మాటలు ప్రభురాత్రి భోజన సంస్కారంలో ముఖ్యమైనవి. ఈ మాటలు స్పస్టంగా చెప్పేదాన్ని నమ్మే వాళ్ళందరికీ పాప క్షమాపణ కలుగుతుంది.
ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని తీసికోడం
నాల్గోదిగా
అయితే ఈ సంస్కారాన్ని తీసుకోటానికి సరిగ్గా సిద్ధపడ్డ వాళ్ళెవరు?
ఉపవాసం ఇంకా ఇతర బాహ్యమైన సిద్ధపాట్లు మంచివే గాని “నీ కొరకు ఇవ్వ బడింది”, పాప క్షమాపణ నిమిత్తమై “నీ కొరకు చిందింప బడింది” అన్న మాటల్ని పరిపూర్ణంగా నమ్మిన వాళ్ళె సరిగ్గా సిద్ధపడ్డ వాళ్ళు. ఎవరు ఈ మాటల్ని నమ్మరో లేదా వీటి గురించి సందేహపడతారో అలాంటి వాళ్ళు సరిగ్గా సిద్ధపడ్డ వాళ్ళు కారు. ఎందుకంటే “నీ కొరకు” అనే మాట నమ్మటానికి సంపూర్ణ విశ్వాసం గల హ్రుదయాలు కావాలి.