బండ్ల మాధవరావు
వికీపీడియా నుండి
చెమట చిత్తడి నేల కవితా సంపుటి ముందుమాట నుండి
- "మట్టిని నమ్ముకున్న శరీరాలకు
- ప్రతిఫలం ఎప్పుదూ మోసమే"
అని అవగాహన చేసుకున్న కవి బండ్ల మాధవరావు. ఇతని తొలి కవితా సంపుటి చెమట చిత్తడి నేల. నేలా, పొలాలూ, చేలూ, రై తులూ, శ్రామికులూ,సాదారణ జన జీవితాలూ ఇతని కవిత్వ పాదాలు. అటు బురద పట్టిన పాదాలో, ఇటు వేదనతో చేలిన పాదాలో, ఆగిన పాదాలో కాదు. కదుల్తున్న పాదాలు. ఆ పాదాల వెంట మనం కదిలి వెళ్తే మట్టిని నమ్ముకున్న వాళ్ళు ప్రస్తుత వ్యవస్త లో మేసపోతున్న తీరు కళ్ళకందుతుంది.
- "రక్తపు చెమటల్ని పవిత్ర విశ్వాసాల్ని
- తాకట్టు పెట్టి తెచ్చి చల్లిన మందులు
- పురుగుల్ని చంపవుకాక చంపవు."
- "నీటి ఊసుల వాగ్దానాలు
- నీటిమీద రాతల్లా కలవరపెడుతుండగా
- నమ్మకంగా పురుగుల్ని చంపాల్సిన మందులు
- నమ్ముకున్నవార్ని అంతం చేస్తున్నాయి"
- "పీకిన వేరుశనగ మట్టలకి
- ఎండిన తాలుగుండెలు వేలాడున్నాయి"
- "పొలేలుగా అని ఎత్తిన చేటకింద
- పొల్లు తప్ప మరేం మిగలటం లేదు"
మంచి వెత్తనం దొరకదు. నేరుండదు. విద్యుత్ కొరత. పురుగు మందుల కల్తీ. ఆఖరికి ఎంతొ కొంత పంట దక్కితే, గిట్టుబాటు ధర దక్కదు. ఇదీ ఇవాల్టి వ్యవసాయ పరిస్థితి. దీన్ని పట్టించుకొంటున్న కవి బండ్ల మాధవరావు. ఒక కవితో రెండు కవితలో కాదు. "అన్నం మొలకెత్తడమంటే", "పత్తి చేలో దిష్టి బొమ్మ జీవితం", "చాటెడు మబ్బు కోసం", "మట్టిని మోసం చేస్తున్నారు", "హింసాత్మక దృశ్యం", - ఈ కవితల నిండా అతలాకుతలమవుతున్న రైతాంగ జీవితమే. మాయామర్మాలు తెలియని జీవితం కవిత్వ వస్తువైనప్పుడు, కవి నిజాయితీని అతని శిల్పం ప్రతిబింబిస్తుంది. మాధవరావు సాదాసీదా పదాల్తో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. మాటల్లో గారడీ లేదు. వినిర్మాణాలు లేవు. అన్వయ క్లిష్టతా లేదు. వస్తువుకి భాషకీ నడుమ సజాతీయ సంబంధం ఉంది. వస్తువుకి తగిన ఆత్మీయభాషను వాడడం ఇతని కవిత్వంలో సుగుణం. ఒక్క రైతు సమస్యలే కాదు, చుట్టూరా ఏ సామాజిక ఘర్షణ తలెత్తినా పట్టుకుంటున్నాడీ కవి. చేనేత కార్మికుల ఆత్మహత్యలూ, గాట్ ఒప్పద దురాక్రమణలూ గోడలమీదికెగబాకుతున్న అశ్లీల సంస్కృతి రేఖలూ, రోడ్లమీద పడ్డ శిధిల బాల్యాలూ, భావరాహిత్యపు చిర్నవ్వుల అందాలపోటిలూ - అన్నింటినీ రికార్డ్ చేస్తున్నాడు. ఎందుకు? జీవిత శిధిలమవుతుందని చెప్పేందుకే. వాస్తవికతను కళ్ళముందు పరిచి ఆలోచింప జేసేందుకే. వర్తమాన చరిత్రకు కవితాత్మక ప్రతిఫలనం.