బడ్జటు
వికీపీడియా నుండి
బడ్జటు అను పదం ప్రస్తుతం ఆదాయ వ్యయాల ప్లానింగునకు చిన్న కుటుంబము నుండి పెద్ద దేశం వరకూ ఉపయోగిస్తున్నారు.
దీనికి వెనక ఓ చిన్న కథ ఉన్నది!
అసలు ఈ బడ్జటు అను పదం bhelgh- అను ఇండో యూరోపు మూల పదంనుండి వచ్చినది, దీనికి అర్థము లావుగా, ఉబ్బెత్తుగా ఉండటం, bulge అను పదం కూడా ఇదే మూల పదం నుండి వచ్చినది, బడ్జటు అనునది లావుగా ఉబ్బెత్తుగా ఉండేటువంటి ఓ సంచీ, బ్యాగు అన్నమాట!
వెనకటికి బ్రిటనులో ప్రతిసంవత్సరం ప్రభుత్వ ఆదాయ వ్యయాలు పార్లమెంటులో వారి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టేటప్పుడు ఇటువంటి సంచీలోనే చాలా జాగ్రత్తగా ఆ కాగితాలు తీసుకోని వచ్చేవారు, అప్పటినుండి ఇటువంటి ఆదాయ వ్యాలను బడ్జటు అని పిలవడం మొదలుపెట్టినారు!