బహుమనీ సామ్రాజ్యము
వికీపీడియా నుండి
బహుమనీ సామ్రాజ్యము దక్షిన భారత దేశమున దక్కన్ యొక్క ఒక ముస్లిం రాజ్యము. ఈ సల్తనతును 1347లో తుర్క governor అల్లాద్దీన్ హసన్ బహ్మన్ షా, ఢిల్లీ సుల్తాన్, మహమ్మద్ బిన్ తుగ్లక్‌కు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి స్థాపించెను. అతని తిరుగుబాటు సఫలమై, ఢిల్లీ సామ్రాజ్యము యొక్క దక్షిణ ప్రాంతములతో దక్కన్‌లో ఒక స్వతంత్ర రాజ్యమును ఏర్పరచినాడు. 1347 నుండి దాదాపు 1425 వరకు బహుమనీల రాజధాని ఎహసానాబాద్ (గుల్బర్గా). ఆ తరువాత రాజధాని, మహమ్మదాబాద్ (బీదర్)కు తరలించారు. బహుమనీలు దక్కన్ మీద ఆధిపత్యమున కొరకై దక్షిణమున ఉన్న హిందూ విజయనగర సామ్రాజ్యముతో పోటీ పడేవారు. ఈ సల్తనతు యొక్క అధికారము మెహమూద్ గవన్ యొక్క వజీరియతులో (1466–1481) ఉచ్ఛస్థాయి చేరుకొన్నది. 1518 తర్వాత అంతహ్కలహాల వలన బహుమనీ సామ్రాజ్యము ఐదు స్వతంత్ర రాజ్యములుగా విచ్ఛిన్నమైనది. ఆ ఐదు రాజ్యములు అహ్మద్‌నగర్, బేరర్, బీదర్, బీజాపూర్, మరియు గోల్కొండ, దక్కన్ సల్తనత్లుగా పేరు పొదాయి.
[మార్చు] బహుమనీ సుల్తానుల జాబితా
- అల్లాద్దీన్ హసన్ బహ్మన్ షా 1347 - 1358
- మహమ్మద్ షా I 1358 - 1375
- అల్లాద్దీన్ ముజాహిద్ షా 1375 - 1378
- దావూద్ షా 1378
- మహమ్మద్ షా II 1378 - 1397
- ఘియాతుద్దీన్ 1397
- షంషుద్దీన్ 1397
- తాజుద్దీన్ ఫిరోజ్ షా 1397 - 1422
- అహ్మద్ షా I వలీ 1422 - 1436
- అల్లాద్దీన్ అహ్మద్ షా II 1436 - 1458
- అల్లాద్దీన్ హుమాయున్ జాలిమ్ షా 1458 - 1461
- నిజాం షా 1461 - 1463
- మహమ్మద్ షా III లష్కరి 1463 - 1482
- మహమ్మద్ షా IV (మెహమూద్ షా) 1482 - 1518
- అహ్మద్ షా III 1518 - 1521
- అల్లాద్దీన్ 1521 - 1522
- వలీ అల్లా షా 1522 - 1525
- కలీమల్లా షా 1525 - 1527