బీరకాయ
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] మొక్క గురించి
గుమ్మడి కుటుంబమునకు చెందినది. బీరతీగ గుమ్మడి కుటుంబమునందలి జాతులలో విస్తరణమున మధ్యమము. నులితీగలు 2 - 5 శాఖలు కలిగి యుండును. ఆకును 5 - 7 కోణములు లేక స్పష్టమగు తమ్మెలు గలిగి ఆయారకములలో మధ్యమ పరిమాణము కలిగి కానీ పెద్దవిగా కానీ యుండును. మగ పూవులు గుత్తులుగ బయలుదేరును. ఇందు 5 తమ్మెలుగల పుష్పకోశమును, ఐదు పసిమి రంగుగల రక్షతపత్రములు ఉండును. కింజల్కములు మూడు. ఆడు పూవున కూడా పుష్పకోశమును, దళవలయమును, మగపూవునందువలెనే యుండును. ఇవి ఉచ్చములు, అనగా అండాశయముపై నమరియుండును. కీలము మూడు అగ్రములు కలిగి కురుచగ ఉండును. మూడు మానమాత్రపు కింజల్కములు కూడా నుండును. బీర పూవులు సాయంకాలము 5 - 6 గంటల మధ్య విడచును. కాయలలో పొడవు 10 - 60 సెం.మీ ఉండును. లావు 2.5 - 3. 5 సెం.మీ ఉండును. పైన స్ఫుటమయిన కోణములు తేరి డోరియాలు కలిగి ఉంండును. సామాన్యముగా ఈ కోణములు పది యుండును. కాయ ఎండిన వెనుక పై చర్మము పీచుకట్టుటయే కాక లోన కూడా కొన్ని పక్షుల గూళ్ళవలె పీచుతో నల్లబడిన అరలు కలిగి యందు పెక్కు గింజలు ఉండును.
[మార్చు] రకములు
[మార్చు] పందిరి బీర
దీనినే పెద్ద బీర, పొడవు బీర అని అంటారు. ఇవి చాలా పొడవు పెరుగును, అనగా సుమారుగా 20-30 సెం.మీ పెరుగును, అనుకూల పరిస్తితులలో అవి 60 సెం.మీ వరకూ పెరుగును. పందిరి ఎక్కించుటవల్ల వీనిని పందిరి బీఋఅ అని అంటారు.
[మార్చు] పొట్టి బీర
ఇవి 12-20 సెం.మీ వరకు పెరుగును. కానీ ఇది లావుగా ఉండును.
[మార్చు] నేతి బీర
ఇది బీర జాతిలలో ఒక ప్రత్యేక జాతి, తీగ సామాన్యముగా బీర జాతికన్నా మోటుగా పెరుగును. తరచు స్వతస్సిద్ధముగా పుట్టి చెట్ల మీద ప్రాకుచుండును. ఆకులు గుండ్రముగా ఐదు తమ్మెలేర్పడియుండును. పూవులు పెద్దవి. పసుపు పచ్చగా ఉండును. మగ పూవులలో కింజల్కములు ఇతర జాతులలోవలె ఉండును. నాలుగు నుండి ఐదు సెంమీ. వరకు లావు అవును. నునుపుగా ఉండును. కానీ సామాన్యపు బీరలోవలెనే పది కోణముల ఆనవాళ్ళూ మాత్రము కనపడును.
ఇది అంత రుచికరముగా ఉండదు, కానీ చూడటానికి మాత్రము బహు రమ్యముగా ఉంటుంది. నేతి బీరలోని నేతి చందముగా అని ఓ సామెత ఉంది కదా మనకు.
[మార్చు] గుత్తిబీర
[మార్చు] సాగు చేయు విధము
బీరపాదులు వర్షాకాలమున బాగుగా పెరిగి కాయును. కానీ వర్షాకాలమున హెచ్చుగా వర్షాలు బచ్చినచో ఈ పాదులు చెడిపోవును. తొలకరి మొదలకొని వర్షాకాలము ముగియువరకు ఈ పాదులు పెట్టుచుండవచ్చును. బీరపాదులన్ని విధముల నేలలోను సులభముగా పెరుగును, కానీ యిసుక కొడి నెలలలో తగ్తినంత సత్తువ జేసిన కానీ పెరగవు
[మార్చు] విశేషములు
మన తెలుగు దేశములో సారా సీసాలు బీర కాయలులా ఉండుటవల్ల వాటిని బీర కాయ అని ముద్దుగా రహస్యముగా పిలుచుట కలదు