బుద్ధాం
వికీపీడియా నుండి
బుద్ధాం గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం లోని గ్రామం. బాపట్ల రేపల్లె రహదారిపై కర్లపాలెం కు 2 కి.మీ. దూరంలోను, జిల్లా ముఖ్యపట్టణానికి 45 కి.మీ. దూరంలోను ఈ గ్రామం ఉంది. వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం. గ్రామదేవత పళ్ళాలమ్మ తల్లి. గ్రామంలో ఒక యునానీ ఆసుపత్రి, ఒక పశువుల ఆసుపత్రి ఉన్నాయి. 1980 లో స్థానిక ప్రభుత్వ సాయంతో గ్రామస్తులే ఒక ఎత్తిపోతల నీటిపారుదల పథకాన్ని నిర్మించుకున్నారు.