బెజవాడ రాజారత్నం
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
బెజవాడ రాజారత్నం తెలుగు సినిమా మొదటి తరం కళాకారుల్లో ఒక్కరు. ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. బెజవాడ రాజారత్నం 1921 సంవత్సరంలో తెనాలి పట్టణంలో జన్మించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి మరియు జొన్నవిత్తుల శేషగిరిరావు గారి వద్ద నేర్చుకొన్నారు. తరువాత లంకా కామేశ్వరరావుతో కలసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయి గాయనిగా మంచి పేరు తీసుకు వచ్చాయి. రుక్మిణీ కల్యాణం,పుండరీక, రాధా కృష్ణ, మీరా వంటి నాటకాలలో నటించటమే కాక సంగీతం అందించటంలో సహాయం చేశారు. మళ్ళీపెళ్ల్లి, విశ్వమోహిని (ఈ పూపొదరింట పాటలో), దేవత (రాదే చెలి పాటలో) వంటి సినిమాలల్లో పాటలలో కనిపించి అలరించారు. భక్త పోతన (1942), మోహిని (1948) సినిమాలలో పాటలు పాడారు. ఘంటసాల బలరామయ్య గారి ముగ్గురు మరాఠీలు సినిమాలో పాడిన 22 యేళ్ళ తరువాత జగదేకవీరుని కథ సినిమాలో పాడారు.
[మార్చు] నటించిన సినిమాలు
- 1934 - సీతా కల్యాణం
- 1939 - మళ్ళీ పెళ్ల్లి
- 1940 - విశ్వమోహిని
- 1941 - దేవత, దక్ష యఙ్ఞం
- 1942 - జీవన్ముక్తి
- 1946 - ముగ్గురు మరాఠీలు
- 1947 - యోగి వేమన
[మార్చు] వనరులు
http://www.telugucinema.com/tc/stars/Bezwada_Rajaratnam.phpi