భగవాన్ దాస్
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
భగవాన్ దాస్ (జనవరి 12, 1869 - సెప్టెంబర్ 18, 1958) భారతీయ తత్వవేత్త. కొంతకాలము ఈయన అవిభాజిత భారతదేశము యొక్క కేంద్ర విధానసభ లో పనిచేశాడు. ఈయన హిందుస్తానీ సాంస్కృతిక సమాజముతో అనుబంధితుడై ఘర్షణ ఒక ఆందోళనా పద్ధతిగా ఉపయోగించడాన్ని చురుకుగా వ్యతిరేకించాడు. స్వాతంత్ర్య సమరయోధునిగా బ్రిటిషు పాలనకు వ్యతిరేకముగా పోరాడుతూ సామ్రాజ్యవాద ప్రభుత్వము నుండి తరచూ ముప్పును ఎదుర్కొన్నాడు.
వారణాసి లో జన్మించిన ఈయన పాఠశాల తరువాత కలెక్షన్ బ్యూరోలో డిప్యుటీగా పనిచేశాడు. ఆ తరువాత ఉన్నత చదువులకోసము ఉద్యోగాన్ని వదిలాడు. అన్నీ బీసెంట్ తో కలిసి ఈయన కేంద్ర హిందూ కళాశాల స్థాపించాడు. ఇదియే ఆ తర్వాత కాలములో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము అయినది. దాస్ ఆ తరువాత జాతీయ విశ్వవిద్యాలయమైన కాశీ విద్యాపీఠమును స్థాపించి ప్రాధానోపాధ్యాయునిగా పనిచేశాడు. భగవాన్ దాస్ సంస్కృత పండితుడు. ఈయన సంస్కృతము, హిందీ బాషలలో దాదాపు 30 పుస్తకాలు రచించాడు. భగవాన్ దాస్ కు భారత ప్రభుత్వము 1955 లో భారత రత్న పురస్కారము ప్రధానము చేసినది.
ఈయన వారణాసిలోని ఒక విభిన్నమైన సంపన్న షా కుటుంబానికి చెందినవాడు. తన కొడుకు శ్రీ ప్రకాశ న్యాయ విద్య అభ్యసించడానికి బ్రిటన్ వెళ్లాలని అనుకున్నప్పుడు సముద్రము దాటడము వలన కులాన్ని ఏమీ కోల్పోమని సమర్ధించడము వలన ఈయనను అగర్వాల్ సమాజము నుండి బహిష్కరించారు.