భోజనం చెయ్యగానే ఎందుకు ఈత కొట్టకూడదు?
వికీపీడియా నుండి
4. భోజనం చెయ్యగానే ఎందుకు ఈత కొట్టకూడదు?
ఎందుకు కొట్టకూడదు? కొట్టాలని ఉంటే కొట్టొచ్చు! కాని ఈ సూత్రం అర్ధ శతాబ్దం కిందట అమెరికన్ రెడ్‌క్రాస్ వారు ప్రచురించిన పుస్తకంలో, “భోజనం చేసిన వెంటనే ఈత కొడితే కడుపులో కండరాలు కొంకర్లు పోతాయి. ప్రాణం కూడ పోవచ్చు” అని ఉంది. చెప్పింది అమెరికా వాడు. పైపెచ్చు రెడ్‌క్రాసు వాళ్ళు. అందుకని అందరూ నమ్మేశారు. కాని 1961 లో ఆర్థర్ స్టయిన్‌హవుస్ అనే మరొక అమెరికా ఆసామి ఈ నమ్మకం తర్కబద్ధం కాదనీ దమ్ములు ఉంటే రుజువు చెయ్యమనీ సవాలు చేసేడు. విజ్ఞానపరంగా ఎవ్వరూ రుజువు చెయ్యలేక పోయారు. అందుకని ఈ మధ్య అమెరికన్ రెడ్ క్రాస్ వాళ్ళు పై రెండు వాక్యాలనీ వారి పుస్తకం నుండి తొలగించేరు. కనుక భోజనం చెయ్యగానే ఈత కొట్ట వచ్చా? కూడదా? ఏమో!