మణిశర్మ
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
మణిశర్మ (జూలై 11, 19??) తెలుగు మరియు తమిళ సినీ రంగంలో పేరుపొందిన సంగీత దర్శకుడు. 80వ దశకంలో కీ.శే. శ్రీ సత్యం గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించారు .ఇప్పటి వరకు 60 చిత్రాలకి పైగా సంగీతాన్నందించారు. ఇతని సంగీతం చాలా వరకు ఫాస్ట్బీట్ తో, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. కానీ ఆయన ప్రతీ సినిమాలో కనీసం ఒక్కటైనా మెలోడీ ఉంటుంది. అందుకే అతనిని మెలోడీ బ్రహ్మ అని కూడా పిలుస్తారు. పరిశ్రమలోని దాదాపు ప్రతీ నాయకుడికి సంగీతాన్ని అందించారు. ఇతనిని అగ్రతారల సంగీత దర్శకుడని కూడా అంటారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నెం. 1 సంగీత దర్శకుడిగా చలామణీ అవుతున్నారు.