మారేడుబాక
వికీపీడియా నుండి
మారేడుబాక, తూర్పు గోదావరి జిల్లా, మండపేట మండలానికి చెందిన గ్రామము
పచ్చని చీర కట్టుకున్న అమ్మాయిలా వుంటుందీ వూరు.ప్రధాన పంట వరి.చెరకును కూడా బాగనే పండిస్తారు.ఎక్కువ మంది వ్యవసాయం మీదే అధారపడి బ్రతుకుతున్నారు.కొంత మంది వ్యవసాయం కౌలుకు ఇచ్చి రైసుమిల్లులు నడుపుకుంటున్నారు.చిన్నాచితకా కుటుంబాల వారు కూలిపనులు,పాలేరు పనులు చేస్తుంటే అంతో కుంతో చదువుకున్నవారు పేపరుమిల్లులో పనిచేసుకుంటున్నారు.
గ్రామ దేవత మావుళ్ళమ్మ తల్లి.ఊరి జాతర జూన్ మాసం లో వస్తుంది.గరగ నెత్తడం దగ్గరినుండి మొదలై అరిసెల పానుపు,గారెల పానుపు లు వెయించుకుని జాగరం అయిన తరువాత సంబరం జరిగి తరువాత తీర్తం వస్తుంది.అంతటి తో ఆ సంవత్సరం జాతర ముగుస్తుంది.రెండు కుటుంబాలు వంతుల వారీ గా గుడి ని నిర్వహిస్తాయి.ఇది కాక శివాలయం,జనార్ధన స్వామి ఆలయం ఒకే ప్రాంగణం లో వుంటాయి.మూడు రామాలయాలు కూడా వున్నాయి.ఒక రామాలయం లో సాయిబాబా పటాన్ని పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు గ్రామస్తులు.ఒక వినాయకుని గుడి కూడా వుంది.దీనిని గణేష్ సెంటర్ అని పిలుస్తారు.అలాగే దేవి నవరాత్రులకు దేవి ని నిలబెట్టే కూడలిని దేవి సెంటర్ అని అంటారు.
ఊరి పెరు చెప్పి 2,3 వీధులే వుంటాయి. పెద్దవీధి,చాకలి పేట,మాల పేట.ఈ వూరికి ఒక ప్రాధమిక పాఠశాల వుంది.2,3 కిరాణా షాపులు తప్పించి ఊరిలొ ఏమి వుండవు.ఏమి కావాలన్న 3 కిలోమీటర్లు దూరం లో వున్న మండపేట వెళ్ళాల్సిందే.ఈ ఊరిపేరు పక్క ఊర్లలో వాళ్ళకి తెలిసింది అంటే అది పేపరు మిల్లు వల్లనే అని చెప్పాలి.ఇన్నాల్లు మండపేట లో వుండే ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాభావం వల్ల ఈ ఊరికి మార్చబడింది.పంట కాలువ వున్నా చాలా వరకు నిరుపయోగముగానే వుంది.పేపరుమిల్లు నుండి వ్యర్ధ పదార్దాలు ఈ కాలువలోకి వదల బడుతాయి.అందుకు రైతులు వ్యర్ధ నీరు కలిసె ప్రదేశం కన్నా ముందే కాలువ నుండి చిన్న చిన్న దారులు చేసి బోదెలు ఏర్పాటు చేసుకుని ఆ నీటిని పొలాలకు మళ్ళిస్తారు.ఊరిలో పశువులను పాడి కోసం పెంచేవారు.ఇప్పుడు ఇలా ఇంటిలో పశువులు పెంచేవారు అరుదుగా కనిపిస్తున్నారు.ఊరిలో ఏ సౌకర్యాలు లేక,చిన్నదానికి కూడా దూరం వెళ్ళాలిసి రావడం వల్ల తాతల కాలం నుండి నివశిస్తున్న కుటుంబాలు అన్ని ఇప్పుడు పక్క ఊర్లకు వలస వెల్లిపోయారు.పేపరుమిల్లు లొ పనిచేసెవారు మాత్రం ఊరిలో తప్పక వుంటున్నారు.ఊరికి పక్కనే 2,3 కిలోమీటర్ల దూరంలో వుండే మండపేటలో స్థలాలు లక్షలు కోట్లు చేస్తుంటే ఇక్కడ మాత్రం వేలల్లోనే వుంటున్నాయి.
ఈ ఊరికి బస్సు సర్వీసుకూడా సరిగా వుండదు.ఎదో ఒక ప్రయివేటు బస్సు నడుపుతారు గానీ అదీ వేళకు రాదు.లేక పోతే అస్సలు రాదు.ఈ ఊరు లో 3,4 సినిమా షూటింగులు కూడా జరిగాయి.ఎక్కువ మేర పెంకుటిళ్ళను చూడవచ్చు.ఎక్కడ చూసినా మట్టి రోడ్డ్లు.ఇంటింటా కొబ్బరి చెట్లు,పెరటిలో కూరగాయలు,ఆకుకూరలూ మొక్కలు. స్వచ్చమైన పల్లెటూరును చూద్దామనుకునేవాళ్ళు ఈ ఊరును దర్శించవచ్చు.