వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం
వికీపీడియా నుండి
మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనేది వికీపీడియా లోని వ్యాస విషయాన్ని నిర్దేశించే మూడు నిర్దేశకాల్లో ఒకటి. మిగతావి తటస్థ దృక్కోణం, నిర్ధారత్వం.
వికీపీడియాలో మౌలిక పరిశోధనా వ్యాసాలకు చోటు లేదు. మీరు రాసేది పరిశోధనా వ్యాసం కాదు అని నిర్ధారించే ఏకైక విధానం.. మీరు రాసిన విషయానికి సంబంధించిన విశ్వసనీయ మూలం/వనరు లను ఉదహరించడమే!
[మార్చు] నిర్వచనం
గతంలో ఏ విశ్వసనీయ వనరులోనూ ప్రచురించబడని వ్యాసాన్ని వికీపీడియాలో మౌలిక పరిశోధనా వ్యాసం అంటారు. ఇంతకు ముందు ప్రచురితం కాని వాదనలు, చర్చలు, భావనలు, డేటా, ఆలోచనలు, ప్రకటనలు, సిద్ధాంతాలు, ఇప్పటికే ప్రచురితమైన విషయాలపై సాగిన కొత్త విషయాలతో కూడిన పరిశోధనాత్మక విశ్లేషణ ఈ కోవలోకి వస్తాయి.