రామావతారము
వికీపీడియా నుండి
రామావతారము త్రేతాయుగములోని అవతారము.
[మార్చు] వంశ వివరాలు
సూర్యవంశానికి చెందిన అయోధ్య రాజు, దశరథమహారాజు. దశరథునికి ముగ్గురు భార్యలు - కౌసల్య, సుమిత్ర, కైకేయి. చాలాకాలంపాటు వారికి పిల్లలు పుట్టని కారణంచేత, సంతానం కోరి యజ్ఞం చేయగా, లభించిన యజ్ఞఫలాన్ని ముగ్గురు రాణులూ ఆరగించారు. ఫలితంగా వారికి పిల్లలు కలిగారు. విష్ణుమూర్తి, ఆదిశేషుడు, శంఖ,చక్రాలు పిల్లలుగా వారికి జన్మించారు వారి వివరాలు. కౌసల్యకు - రాముడు (విష్ణుమూర్తి) సుమిత్రకు- లక్ష్మణుడు (ఆదిశేషుడు) కైకేయికి - భరతుడు, శతృఘ్నుడు (శంఖ,చక్రాలు)
లక్ష్మీదేవి మిథిలా నగర పాలకుడైన జనకుడికి కుమార్తె - సీత - గా జన్మించి రాముని పెళ్ళిచేసుకుంది.
[మార్చు] వృత్తాంతము
రాముని కథని వాల్మీకి మునివరేణ్యులు, నారదుని మార్గనిర్దేశములో రామాయణముగా అద్భుతముగా, సులభంగా రచించి సంస్కృతములో ఆదికవి గా గుర్తింపు పొందింనారు.
భూభారం పెరిగిపొయినదని భూదేవి వెళ్ళి విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటే, విష్ణుమూర్తి అభయం ఇచ్చి దశరథునికి పుత్రునిగా జన్మించి విశ్వామిత్రునితో వెళ్లి తాటకి, మారీచ, సుబాహు మొదలగు రాక్షసులను వధిస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల రామునికి వనవాసం ప్రాప్తిస్తుంది, ఇక్కడ వారు భారత దేశం మొత్తం తిరుగుతూ, చాలా మంది రాక్షసులని వధిస్తారు. అటుపిమ్మట రావణాసురుడు తన సోదరి ఐన శూర్పణఖ సలహాపై సీతను అపహరిస్తే, రాముడు వానరుల సహాయంతో సముద్రానికి సేతువు కట్టి గొప్ప యుద్దంచేసి రాక్షస సంహారం చేస్తాడు.
తరువాత సీతతో కూడి పుష్పక విమానం పై అయోధ్యకు విచ్చేసి పదునాలుగువేల సంవత్సరాలు ప్రజానురంజకంగా పరిపాలన చేస్తాడు। ఇప్పటికీ ప్రజలు రామరాజ్యం అని ఆనాటి పరిపాలనను గుర్తుతెచ్చుకుంటారు.
హనుమంతుడు రాముని దూత, భక్తుడు. సీతారాములకు అత్యంత ప్రీతిపాత్రుడు.. లవుడు, కుశుడు అను కవలలు రాముని కుమారులు.
దశావతారములు | |
---|---|
మత్స్య | కూర్మ | వరాహ | నరసింహ | వామన | పరశురామ | రామ | కృష్ణ | బలరామ / బుద్ధ | కల్కి |
దశావతారాలని చెప్పి పదకొండు ఇచ్చేరు జాబితాలో! బలరాముడి పేరు మినహాయిస్తే సరిపోతుంది.