రాయచూరు అంతర్వేది
వికీపీడియా నుండి
కృష్ణా మరియు తుంగభద్ర నదులు మధ్యనున్న త్రిభుజాకారపు ప్రాంతాన్ని రాయచూరు అంతర్వేది లేదా రాయచూరు దోబ్ అంటారు. దోబ్ అన్న పదము దో+అబ్ అన్న రెండు పదాల కలయిక (అబ్ అంటే పర్షియన్ లో నీరు అని, దో అంటే రెండు). సారవంతమైన ఈ ప్రాంతము దక్షిణభారత దేశ చరిత్రలో మధ్యయుగాలలో ముఖ్య పాత్ర పోషించినది. ఈ ప్రాంతములో ముఖ్యపట్టనమైన రాయచూరు మీదుగా ఈ ప్రాంతానికి రాయచూరు అంతర్వేది అన్నపేరు వచ్చింది. ఈ ప్రాంతము ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ మరియు కర్నాటక రాష్ట్రాలలో విస్తరించి ఉన్నది.
విజయనగర రాజులు మరియు దక్కను సుల్తానుల మధ్య రాయచూరు అంతర్వేది ఆధిపత్య విషయము అనేక యుద్ధాలకు దారి తీసినది. ఇక్కడ రాయచూరు, ముద్గల్లు కోటలు ఉన్నాయి.