వరహగిరి వేంకటగిరి
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
వి.వి.గిరిగా ప్రసిద్ధుడైన వరహగిరి వేంకటగిరి (ఆగష్టు 10, 1894 - జూన్ 23, 1980), భారతదేశ నాలుగవ రాష్ట్రపతి.
ఈయన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్ పట్టణములోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. ఈ జిల్లా మరియు పట్టణము ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రములో ఉన్నాయి.
1913లో ఈయన యూనివర్శిటీ కళాశాల డబ్లిన్ లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లాడు కానీ ఐర్లండ్ లో సీన్‌ఫెన్ ఉద్యమములో పాల్గొని గిరి దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఈ ఉద్యమకాలములోనే ఈయనకు ఈమొన్ డి వలేరా, మైఖెల్ కోలిన్స్, పాట్రిక్ పియర్సె, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఈయోన్ మెక్‌నీల్, జేమ్స్ కాన్నలీ తదితరులతో సన్నిహితము యేర్పడినది.
భారతదేశము తిరిగివచ్చిన తర్వాత క్రియాశీలముగా కార్మిక ఉద్యమములో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యాడు. రెండు పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రేసుకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.