వాణీ విశ్వనాధ్
వికీపీడియా నుండి
వాణీ విశ్వనాథ్ త్రిశ్శూరు కు చెందిన మళయాల సినిమా నటి. ఈమె తెలుగు, తమిళ సినిమాలలో కూడా నటించినది. వాణీ విశ్వనాథ్ ప్రతినాయక పాత్రలు పోషించే బాబురాజ్ ను పెళ్లి చేసుకొని మద్రాసులో స్థిరపడినది. ఈమెకు చెన్నై లో ఒక పాప పుట్టింది. కేరళ జానపద గాథలలో వీరవనిత అయిన ఉన్ని అర్చ పేరు మీదుగా అర్చ అని నామకరణము చేశారు. వాణీ తన సినిమా జీవితములో చివరగా చేసిన సినిమాలలో పి.జి.విశ్వాంభరన్ దర్శకత్వములో ఒక సినిమాలో ఉన్ని అర్చ పాత్రను పోషించినది.