షేక్ నాజర్
వికీపీడియా నుండి
[మార్చు] షేక్ నాజర్
గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద ముస్లిం కుటుంబంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన నాజరు జన్మించాడు. నాజరు పూర్తి పేరు షేక్ నాజరు వలి.
[మార్చు] బుర్రకథకు జీవం
ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథాపితామహుడు నాజర్, గొప్పనటుడు, ప్రజారచయిత, మహాగాయకుడు. " ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజాకళాకారుడు.
కమ్యూనిస్టుపార్టీలోచేరి ప్రజానాట్యమండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను కార్యక్రమాలను బుర్రకథల ద్వార ప్రచారం చేశాడు. పల్నాటి యుద్ధం , వీరాభిమన్యు, బొబ్బిలియుద్ధం, అల్లూరి సీతారామరాజు మొదలగు ఇతివృతాలలో నమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు. 'అసామి ' అనే నాటకంరాసి ప్రదర్శనలిచ్చాడు. నాజర్ ఆత్మకథ పింజారి పేరుతో వెలువడింది. పుట్టిల్లు , అగ్గిరాముడు, చిత్రాలలో బుర్రకథలు చెప్పడు. నిలువుదోపిడి, పెత్తందార్లు చిత్రాలకు పనిచేసాడు. కొంతకాలం విరసం సభ్యుడు.
[మార్చు] కళాప్రతిభ
వేదికపై నాజరు రాగ తాళ నృత్యాభినయ మెరుపు విన్యాసాలు చూడటం ఓ అద్భుతం .రంగస్థల మహానటుడు బళ్లారి రాఘవాచార్యులు నాజరు బుర్రకథ విని అమితానందంతో బళ్లారికి ఆహ్వానించడం, మద్రాసులో ప్రదర్శన చూచిన డా: గోవిందరాజుల సుబ్బారావు నాజరుని అభినందిస్తూ కౌగిలించుకోవడం , ప్రముఖ పాత్రికేయుడు కె.అబ్బాస్ నాజరును ' ఆంధ్ర అమరషేక్ ' అని అభివర్ణించడం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నాజరు ప్రజాభాషకు ముగ్ధుడై ' నా బిడ్డడు ఎంత ఎదిగిపోయాడో ' అని ఆలింగనం చేసుకోవడం, నాజరు సాధించిన కళాప్రతిభకు తిరుగులేని నిదర్శనాలు.1986 లో భారతప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో నాజరును సత్కరించింది.
నింగితాకే రాగతరంగం
కదనుతొక్కే కవన తురంగం
నాజరుగళం రగడవిరుపులు
బుర్రకథా కళల వీరంగం
1997 ఫిబ్రవరి 22న అంగులూరులో అస్వస్థతతో మణించాడు.