సౌపాడు
వికీపీడియా నుండి
సౌపాడు, గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలానికి చెందిన గ్రామము. ఇది జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 16 కిలోమీటర్ల దూరములో ఉన్నది
సౌపాడు గ్రామము భిన్న సంస్కృతులతో కూడిన ఒక గ్రామము. అందరు ఎంతో కలిసికట్టుగా ఉంటారు.దానికి ఉదాహరణగా గ్రామములో జరుపుకునే శివరాత్రి, ఆంజనేయ స్వామి తిరునాళ్ళ. శివరాత్రి పండుగ రోజు ఊరిలోని అందరు కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. ఈ ఊరిలో ప్రధాన వృత్తి వ్యవసాయము. ప్రధాన పంట వరి. రెండో పంటగా మినుము, జనుము, పెసర, శనగ, పిల్లిమిసర మొదలుగునవి పండిస్తారు.