అన్నవరం
వికీపీడియా నుండి
అన్నవరం, శంఖవరం, తూర్పు గోదావరి జిల్లా, శంఖవరం మండలానికి చెందిన గ్రామము
అన్నవరం ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం. తూర్పు గోదావరి జిల్లా నందు శంఖవరం మండలానికి చెందిన గ్రామము. ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటంది. హందూవులు పవిత్రంగా భావించే కార్తీకమాసంలో ఇచ్చట కనీ వినీ ఎరుగని రీతిలో భక్తులు వస్తంటారు.
అన్నవరం - పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ గుడిని కట్టి రెండు వందల ఏండ్లే అయినా మంచి ప్రాముఖ్యాన్ని పొందింది. సమీపంలో పంపా నది హోయలొలుకుతూ పారుతుంటుంది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ని దర్శించేందుకు గుడివరకు ఘాట్ రోడ్డు నిర్మించారు. మెట్లు గుండాకూడ వెళ్ళవచ్చు.
ఇక్కడ స్వామిని మూడంతస్ధులలో అర్చించుకుంటారు. క్రింది అంతస్ధులో విష్ణువనీ -త్రిమూర్తులను ఒకేచోట పూజించుకోవచ్చనే చెబుతారు. అందుకే " మూలతో బ్రహ్మరూపాయ మధ్యతశ్చ మహేశ్వరం అగత విష్ణురూపాయ త్ర్త్యెక్య రూపాయతేనమ " అని స్తుతిస్తారు.
ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండువగా చేసికొంటూ వుండటం ఒక ప్రత్యేకత. చూచి తీరవలసిన సుందర దృశ్యం. కొండమీద తులసివనం, వనం మధ్యలో పాముపుట్ట, రామాలయం - యివి దర్శనీయ స్థలాలు. శ్రీ పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన సన్ డయల్ (కాల నిర్ణయ నిర్దేశక యంత్రం) స్వామి సన్నిధిలో రత్నగిరిమీద వుంది. ఎండ ఆధారంగా కాల నిర్ణయం చేస్తుందీ గడియారం. వైశాఖ శుద్ద దశమి నుండి, వైశాఖ బహుళ పాఢ్యమి వరకు శ్రీ స్వామివారి జయంతి ఉత్సవములు జరుగును. స్వామి దర్శన వేళలు ఉదయం 6 గం నుండి రాత్రి 8 గం వరకు. అన్ని వర్గాల వారికి వసతి బ్ణోజన సదుపాయాలు లభ్యమవుతున్నయి. అన్నవరం - విజయవాడ- విశాఖపట్నం రైలు మార్గంపై వుంది. కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి అన్నవరం మీదుగా పోతుంది.రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ దూరంలో ఉన్నది.