ఆటలు
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] ఆటలు
శరీరక సౌష్టవము కొఱకు, మానసిక ఉల్లాసము కొఱకు తర తరాలనుండి ఆటలు ఒక అద్భుతమైన సాధవముగా ఉన్నాయి. మన వాళ్ళు రక రకాల ఆటలు ఆడుతూ ఉంటారు.
[మార్చు] దాడి
- ప్రధాన వ్యాసము: దాడి ఆట
ఆడే పద్దతిఃఆడేవాళ్ళు యిద్దరుంటారు. 9 నప్పులుంటాయి. ఒకరి తర్వాత ఒకరు, ఒక్కొక్కటి చప్పున నప్పాలి. ఎవరివైనా మూడు నప్పులు, అడ్డంగా గాని, నిలువుగా గాని ఒకే వరుసలో వస్తే ఒక దాడి జరిగినట్లు. దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి నప్పులలోంచి ఒక నప్పును (దాడి జరగనిది మాత్రమే) తీసుకుంటారు. ఒకసారి దాడి జరిపిన నప్పుని, ప్రక్కకు జరిపి, దానితో మరల దాడి చెయ్యవచ్చును. ఇలా ఆడే యిద్దరిలో ఎవరివో ఒకరి నప్పులు పూర్తయ్యేవరకు ఆడుకోవచ్చును. మూలలో బాణం గుర్తులున్న కోణాలలో వరసగా నప్పులు పెట్టడం దాడిగా ఒప్పుకోబడదు.
[మార్చు] పులి-మేక
- ప్రధాన వ్యాసము: పులి-మేక
ఆడే పద్దతిః
ఆటగాళ్ళుః యిద్దరు, కావలసినవిః 3-పులులు, 15-మేకలు
పైనున్నది కొండ, క్రింద గళ్ళు అడవి, పులులు 3 కొండపైనే వుండాలి. ముందుగా ఒక మేకని అడవిలో వదలాలి, దాన్ని చంపేందుకు ఒక పులిని కొండమీంచి అడవిలోకి దించాలి. పులి కదలికలను బట్టి, మొదటి మేకకు కాపుగా ఇంకో మేకని నప్పాలి. అవసరాన్నిబట్టి ఒక్కొక్క పులిని కొండమీంచి దింపనూనచ్చు, కొండమీదకు పంపనూవచ్చు. ఇలా పులుల కదలికల్ని బట్టి, వాటికి అందకుండా 15 మేకల్ని క్రాస్ ల మీద పేర్చాలి, పులి తన తర్వాతి క్రాస్ మీద ఇన్న మేక మీంచి పైనుండి క్రిందికి కాని, అడ్డంగా గాని దూకవచ్చు. అలా దూకితే ఆ మేక చని పోయినట్లు భావించి ఆటలోనించి తీసేయ్యాలి. ఆయితే ఒక గడి ఎడంగాఉన్నా, లేదంటే వరుసగా వున్న రెండు మూడు మేకల మీంచి గాని పులి దూకకూడదు. ఆలాగే 15 మేకల్తోనూ 3 పులుల్ని కదలకుండా కట్టెయ్యచ్చును. అలా ఎక్కువ మేకలు చనిపోతే పులుల పార్టీ, పులులు కట్టుబడిపోతే మేకలపార్టీ నెగ్గినట్లు. మేకలు పులులమీంచి దూకలేవు సుమా! ఆడటం అలవాటైతే చదరంగం లాగానే ఆడుకోవచ్చు.
[మార్చు] ఆష్టా చెమ్మ
- ప్రధాన వ్యాసము: ఆష్టా చెమ్మ
ఆడే పద్దతిః
[మార్చు] వైకుంఠ పాళీ
[మార్చు] గోడిబిళ్ళ(బిళ్ళంగోడి)
[మార్చు] కబాడీ
[మార్చు] కోతి కొమ్మచ్చి
- ప్రధాన వ్యాసము: కోతి కొమ్మచ్చి
ఈ ఆటలో ముందుగా ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. మిగతా వారిలో ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో గీచిన గీతలోనుండి విసురుతారు. ఇలా వృత్తాకారంలో గీచిన గీతను గిరి అని కూడా పిలుస్తారు. అలా విసరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరో ఒకరిని తాకగల్గితే అలా దొరికిన అతను తర్వాత దొంగ అవుతాడు. ఒక వేళ దొంగ ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు గిరిలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు.
[మార్చు] దొంగ పోలీస్
[మార్చు] నేల-బండ
ఈ ఆట ముఖ్యంగా 6 నుండి 13 వరకు వయసు గల బాల బాలికలు ఆడు ఆట. ఈ ఆటను ఎంతమందయినా ఆడవచ్చును. మొదటగా ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. ఈ ఆట ఆడు ప్రదేశమందు మట్టి ప్రదేశము (నేల)మరియు రాతి పృదేశము (బండ)ఉండవలెను. ముందుగా దొంగని నేల కావాలో బండ కావాలో కోరుకోమంటారు. ఉదాహరణకి దొంగ నేల కోరుకున్నచో,దొంగ నేల మీద మరియు మిగిలిన వారందరు బండ మీద ఉంటారు. బండ మీద ఉన్నవారు నేల మీదకి వచ్చి దొంగని ఆటపట్టిస్తూ ఉంటారు. దొంగ బండ మీదకి వెళ్లకుండా నేల మీదకి వచ్చిన వాళ్లని పట్టుకోవటానికి ప్రయత్నించవలెను. ఇదియే దొంగ ముఖ్య లక్ష్యం. దొంగకి చిక్కిన వారు దొంగ స్థానమును భర్తీ చేస్తారు. ఈ ఆట చిన్న పిల్లలకు బాగా ఇష్టమైన ఆట.
[మార్చు] తొక్కుడు బిళ్ళ
[మార్చు] దాగుడుమూతలు
[మార్చు] చెడుగుడు
[మార్చు] కోకో
[మార్చు] క్రికెట్
ఇండ్యా లొ బాగా ఆడె ఆట ఈ క్రికెట్.ఈ ఆట ఆడటానికి రెండు టీంలు వుందాలి. ఓక్కక టీం లొ 11 మంది వుంటారు.