ఆది పర్వము
వికీపీడియా నుండి
వికీపీడియా నలుగురుకీ అందుబాటులో ఉండాలంటే తెలుగు అంకెలకి (౯,౯౮౪ వగైరా)బదులు హిందూ అంకెలు (1, 2, వగైరా)వాడితే బాగుంటుంది.
ఆదికవి రచించిన, ఆది కావ్యమైన శ్రీమదాంధ్ర మహాభారతం లో మొత్తం ౧౮ ఉపపర్వాలు, ౮ [అశ్వాసాలు]] కలవు. సంస్కృత భారతంలోని ఆది పర్వంలో మొత్తం ౯,౯౮౪ శ్లోకాలు ఉంటే, శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో మొత్తం పద్యాలు, గద్యాలు కలిపి ౨,౦౮౪ ఉన్నాయి.
ఆది పర్వం ఈ క్రింది సంస్కృత మంగళ శ్లోకం తో ప్రారంభం అవుతుంది.
శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే
లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే.
ఆ తరువాత ఒక వచనం, తరువాత ఈ క్రింది ఉత్పలమాలతో ప్రారంభం అవుతుంది.
రాజకులైకభూషణుడు, రాజమనోహరు, డన్యరాజతే
జోజయశాలిశౌర్యుడు, విశుద్దయశశ్శరదిందు చంద్రికా
రాజితసర్వలోకు, డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్
ఈ ఆదిపర్వంలో
[మార్చు] ప్రథమాశ్వాసము
అవతారిక, మొదలగున్నవి, శమంతపంచకాక్షౌహిణీ సంఖ్యా కథనము, ఉదంకుడు కుండలాలు తెచ్చి గురుపత్నికిచ్చు కథ, సర్పయాగముకై ఉద్ధవుడు జనమేజయుడిని ప్రోత్సహించుట మొదలగునవి కలవు।
[మార్చు] ద్వితీయాశ్వాసము
నందు, గరుడుని కథ, దేవదానవులు సముద్రము మదించి అమృతము సాధించుట, దేవదానవు