ఉండ్రాజవరం గ్రామం
వికీపీడియా నుండి
ఉండ్రాజవరం, పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలానికి చెందిన ఒక గ్రామం. ఈ గ్రామం పోతునూరు గ్రామపంచాయతి పరిధి లోనిది. గ్రామ జనభా సుమారు 2000 ఉంటారు. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రదానంగా వరి సాగుచేస్తారు. ఈ గ్రామానికి దగ్గరలోనే జాతీయ రహదారి-5 మరియు గోదావరి పశ్చిమ కాలువ వెలుతున్నాయి. ఈ కాలువ కారణంగా గ్రామ ప్రజలకు నీటి కొరత అనేదే ఉండదు. వీరు ఏడాదికి మూడు పంటలు పండిస్తారు.