కేంద్రపాలిత ప్రాంతము
వికీపీడియా నుండి
భారత దేశం లో ఒక ప్రాంతం. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిపాలించబదుతాయి. కేంద్ర పాలిత ప్రాంతాలకు రాస్థ్రాలకున్న హక్కులు, అధికారాలు లేవు.
దేశమంతటిలో విభిన్న చరిత్ర, సాంస్కృతిక వారసత్వము గల కొన్ని ప్రాంతాలను, భౌగోళికంగా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న ప్రదేశాలను, అంతర్ రాష్ట్ర వివాదాల వలన కేంద్ర ప్రభుత్వముచే పాలించవల్సి వచ్చిన ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా యేర్పరిచారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక లెఫ్టినెంట్ గవర్నర్ను నియమిస్తుంది. ఆ అధికారి ప్రాంతీయ ప్రభుత్వానికి అధినేత. కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలో విధాన సభలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాలలో ముఖ్య మంత్రి పదవి కూడా వుంటుంది.
2006 నాటికి భారత దేశంలో ఏడు (7) కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నయి. ప్రస్తుత జాబితా:
- అండమాన్ మరియు నికోబార్ దీవులు - ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న దీవులు
- చండీగఢ్ - పంజాబ్ మరియు హర్యానాల మధ్య ఎవరికి చెందాలనే వివాదముతో కేంద్రపాలిత ప్రాంతమయ్యింది. పంజాబ్ ఒడంబడిక ప్రకారం దీనిని పంజాబ్ కు ఇవ్వడం జరిగింది కానీ, బదిలీ ఇంకా పూర్తవలేదు. అంతదాకా కేంద్రపాలిత ప్రాంతంగానే కొన్సాగుతుంది
- దాద్రా మరియు నగర్ హవేలీ - పోర్చుగీసు సాంస్కృతిక వారసత్వం, గోవా నుండి చాలా దూరంగా ఉండటం
- దమన్ మరియు దియ్యు - పోర్చుగీసు సాంస్కృతిక వారసత్వం, గోవా నుండి చాలా దూరంగా ఉండటం
- లక్షదీవులు - ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న దీవులు
- ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం - జాతీయ రాజధాని ప్రాంతం
- పాండిచ్చేరి - ఫ్రెంచి సాంస్కృతిక వారసత్వం
రాజ్యాంగ ప్రకారం ఢిల్లీ 1991 నుంచి "జాతీయ రాజధాని ప్రాంతం" హోదా కలిగి ఉంది, కానీ వ్యావహారికంగా ఢిల్లీని కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించవచ్చు. ఢిల్లీకి త్వరలో రాష్ట్రం హోదా ఇచ్చే సూచనలు కూడా ఉన్నాయి.
[మార్చు] గణాంకాలు
సంఖ్య | కేంద్రపాలిత ప్రాంతం | రాజధాని | విస్తీర్ణం (చ.కి.మీ) |
జనాభా 2001 |
జనసాంద్రత 2001 |
అక్షరాస్యత(%) 2001 |
ప్రధానభాషలు |
---|---|---|---|---|---|---|---|
1 | అండమాన్ మరియు నికోబార్ దీవులు | పోర్ట్ బ్లెయిర్ | 8,249 | 356,152 | 43 | 81.18 | హిందీ |
2 | చండీగఢ్ | చండీగఢ్ | 144 | 9,00,635 | 7,900 | 81.76 | హిందీ, పంజాబీ |
3 | దాద్రా మరియు నగర్ హవేలీ | సిల్‌వాస్సా | 491 | 220,490 | 491 | 60.03 | గుజరాతీ, హిందీ |
4 | డామన్ డయ్యు | డామన్ | 122 | 158,204 | 1,411 | 81.09 | గుజరాతీ |
5 | ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం | ఢిల్లీ | 1,483 | 13,850,507 | 9,294 | 81.82 | హిందీ |
6 | లక్షదీవులు | కవరత్తి | 32 | 60,650 | 1,894 | 87.52 | మలయాళం |
7 | పాండిచ్చేరి | పాండిచ్చేరి | 492 | 9,74,345 | 2,029 | 81.49 | తమిళం |